Visakhapatnam: విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. టికెట్ల విక్రయాలు ప్రారంభం.. ధరలివే?

Visakhapatnam: ఈ నెల 31న ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ కోసం నేడు అంటే ఆదివారం ఉదయం 10 గంటల నుంచి టికెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31న ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్ కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు 27వ తేదీ నుంచి టికెట్ల విక్రయాలు జరగనున్నాయి.

Visakhapatnam: విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. టికెట్ల విక్రయాలు ప్రారంభం.. ధరలివే?
Ipl 2024 Vizag

Edited By:

Updated on: Mar 24, 2024 | 10:32 AM

Visakhapatnam: వైజాగ్‌లో ఐపీఎల్ సందడి ప్రారంభంకానుంది. డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈనెల 31, వచ్చే నెల 3వ తేదీన నిర్వహించనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) మ్యాచ్‌లకు సంబంధించి నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం తెలిపింది.

ఈ నెల 31న, ఏప్రిల్ 3న మ్యాచ్ లు..

ఈ నెల 31న ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ కోసం నేడు అంటే ఆదివారం ఉదయం 10 గంటల నుంచి టికెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31న ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్ కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు 27వ తేదీ నుంచి టికెట్ల విక్రయాలు జరగనున్నాయి.

పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ వెబ్‌సైట్ల ద్వారా టికెట్ల అమ్మకం..

పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లను కొనుగోలు చేయవచ్చని తెలిపింది ఢిల్లీ క్యాపిటల్స్. అదే సమయంలో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టికెట్లను పీఎం పాలెంలో ఉన్న స్టేడియం ‘బి’ గ్రౌండ్, నగరంలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడెమ్షన్‌ కౌంటర్ల ద్వారా పొందవచ్చని వివరించారు. ఏప్రిల్‌ 3వ తేదీ మ్యాచ్‌కు 26 తేదీ నుంచి, ఈ నెల 31వ తేదీ మ్యాచ్‌ కోసం 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి రెడీమ్‌ చేసుకోవచ్చని ఢిల్లీ కాపిటల్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది.

టికెట్ల ధరలు ఇలా..

విశాఖలో జరగనున్న రెండు ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ఆన్ లైన్‌లో విక్రయించే టికెట్ల ధరలను కూడా ఈ మేరకు ప్రకటించింది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. రూ. 7,500, రూ. 5,000, రూ. 3,500, రూ. 3,000, రూ. 2,500, రూ. 2,000, రూ. 1,500, రూ. 1,000 విలువ చేసే టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయనీ వెల్లడించింది.

IPL 2024 షెడ్యూల్:-

22 మార్చి CSK vs RCB చెన్నై (చెన్నై విజయం)

23 మార్చి PBKS vs DC మొహాలి (పంజాబ్ విజయం)

23 మార్చి KKR vs SRH కోల్‌కతా (కోల్‌కతా విజయం)

24 మార్చి RR vs LSG జైపూర్

24 మార్చి GT vs MI అహ్మదాబాద్

25 మార్చి RCB vs PBKS బెంగళూరు

26 మార్చి CSK vs GT చెన్నై

27 మార్చి SRH vs MI హైదరాబాద్

28 మార్చి RR vs DC జైపూర్

29 మార్చి RCB vs KKR బెంగళూరు

30 మార్చి LSG vs PBKS లక్నో

31 మార్చి GT vs SRH అహ్మదాబాద్

31 మార్చి DC vs CSK వైజాగ్

1 ఏప్రిల్ MI vs RR ముంబై

2 ఏప్రిల్ RCB vs LSG బెంగళూరు

3 ఏప్రిల్ DC vs KKR వైజాగ్

4 ఏప్రిల్ GT vs PBKS అహ్మదాబాద్

5 ఏప్రిల్ SRH vs CSK హైదరాబాద్

6 ఏప్రిల్ RR vs RCB జైపూర్

7 ఏప్రిల్ MI vs DC ముంబై

7 ఏప్రిల్ LSG vs GT లక్నో

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..