IPL 2023: ఇంపాక్ట్ ప్లేయర్‌పై అందుకే ఆసక్తి.. బౌలర్లకు మాత్రం చావు దెబ్బే: కేకేఆర్ పేస్ బౌలర్

Tim Southee: ఐపీఎల్ ప్రారంభం కాకముందే 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో లీగ్ మొదలైంది. అన్ని టీంలు కూడా ఈ నియమాన్ని పాటిస్తూ.. కీలక దశలో తుఫాన్ ప్లేయర్స్‌ను రంగంలోకి దింపుతున్నాయి.

IPL 2023: ఇంపాక్ట్ ప్లేయర్‌పై అందుకే ఆసక్తి.. బౌలర్లకు మాత్రం చావు దెబ్బే: కేకేఆర్ పేస్ బౌలర్
Kolkata Knight Riders
Follow us
Venkata Chari

|

Updated on: Apr 07, 2023 | 2:58 PM

Kolkata Knight Riders: ఐపీఎల్ ప్రారంభం కాకముందే ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో లీగ్ మొదలైంది. అన్ని టీంలు కూడా ఈ నియమాన్ని పాటిస్తూ.. కీలక దశలో తుఫాన్ ప్లేయర్స్‌ను రంగంలోకి దింపుతున్నాయి. IPL పోటీల్లో మరింత నూతనత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఈ ఎడిషన్‌లో కొత్తగా కొన్ని రూల్స్ చేర్చింది. ఇందులో టాస్ తర్వాత ప్రతి జట్టు తమ ప్లేయింగ్ XIతోపాటు.. ఐదుగురు ప్రత్యామ్నాయ ప్లేయర్లు అంటే ఇంపాక్ట్ ప్లేయర్లలను నామినేట్ చేసే అవకాశాన్ని ఇచ్చింది.

ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌ల్లో 200 కంటే ఎక్కువ పరుగులు మూడు సార్లు, 190 కంటే ఎక్కువ పరుగులు నాలుగు సార్లు వచ్చాయి. జట్లు మూడుసార్లు 160కి పైగా స్కోర్‌లను విజయవంతంగా చేజ్ చేశాయి. ఈ క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం స్టార్ బౌలర్ టిమ్ సౌథీ మాట్లాడుతూ.. ప్రతీ టీం తమ బ్యాటింగ్ లోతులను పరిశీలించేందుకు, అలాగే పటిష్టం చేసేందుకు ఇంపాక్ట్ ప్లేయర్ నియమాన్ని పాటిస్తున్నాయంటూ చెప్పుకొచ్చాడు.

‘కొత్తదనం దానితో కొంత అనిశ్చితిని తెస్తుంది. మే 28న టోర్నమెంట్ ముగిసిన తర్వాతే కొత్త నియమంతో ఎలా ప్రభావాన్ని సృష్టించాలనే దానిపై జట్లకు సరైన అవగాహన వస్తుందని’ సౌతీ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

“మీరు కొత్త నియమాలను ప్రవేశపెట్టిన ప్రతిసారీ, ఆసక్తికరంగా ఉంటుంది. టోర్నమెంట్ తర్వాత ప్రతి ఒక్కరూ దాని గురించి మరింత అవగాహన కలిగి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ ప్రస్తుతానికి జట్లు తమ బ్యాటింగ్‌ లైనప్‌ను పటిష్టం చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా కనిపిస్తోంది, ” అని 34 ఏళ్ల బౌలర్ టీవీ9 నెట్‌వర్క్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపాడు.

“ఒక బౌలర్‌కి, ఇది ఎల్లప్పుడూ ఆదర్శంగా మాత్రం ఉండదు. ఇప్పటికే టోర్నీలో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఇది ఎలా ముగుస్తుందో చూడాల్సి’ ఉందంటూ ఈ బౌలర్ పేర్కొన్నాడు.

2011 నుంచి IPL ఆడుతున్న సౌతీ.. ప్రస్తుతం కోల్‌కతా ఐదవ ఫ్రాంచైజీ. 53 మ్యాచ్‌లలో 47 వికెట్లతో సత్తా చాటిన సౌతీ.. ఈ రైట్ ఆర్మర్ క్రమం తప్పకుండా స్వింగ్, డెత్-బౌలింగ్‌తో బ్యాటర్లను ఇబ్బందులకు గురిచేస్తుంటాడు.

అయితే మూడేళ్లపాటు బయో-బబుల్స్‌లో ఆడిన తర్వాత, సౌతీ ఈడెన్ గార్డెన్స్‌లోని సాధారణ వాతావరణాన్ని ఆస్వాదిస్తానంటూ చెప్పుకొచ్చాడు. మొహాలీలో పంజాబ్ కింగ్స్‌తో తమ టోర్నమెంట్ ఓపెనింగ్ మ్యాచ్‌ను కోల్పోయిన కోల్‌కతా.. గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు సిద్ధమైంది. తమ జట్టుకు బలమైన సొంత అభిమానుల మద్దతు అవసరమని న్యూజిలాండ్ పేసర్ అభిప్రాయపడ్డాడు.

“కోల్‌కతాలోని ఐకానిక్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆడటం చాలా ఉత్సాహంగా ఉంది. మూడేళ్ల తర్వాత కోల్‌కతాలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో కేకేఆర్‌ రిటైన్‌ చేసుకున్న 14 మంది ఆటగాళ్లలో సౌథీ ఒకరు. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయపడకపోవడంతో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన నితీష్ రాణాకు కెప్టెన్సీ బాధ్యతలు తప్పలేదు. అపారమైన ఒత్తిడి, తీవ్రమైన పరిశీలనలతో రానా ప్రయోజనం పొందుతాడని సౌతీ అభిప్రాయపడ్డాడు.

“నితీష్ తన నాయకత్వ లక్షణాలను చూపించడానికి ఇది ఒక అవకాశం. అతను దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీకి కెప్టెన్‌గా ఉన్నాడు. గొప్పగా రాణిస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..