KKR vs RCB Highlights : చిత్తుచిత్తుగా ఓడిన బెంగళూరు.. బోణి కొట్టిన కోల్ కతా
KKR vs RCB Highlights: మొదటి మ్యాచ్ లో ఘన విజయం సాధించిన బెంగళూరు రెండోమ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. కోల్‌కతా స్పిన్నర్ల ధాటికి చతికిలపడిపోయింది. 205 పరుగుల లక్ష్య ఛేదనలో 17. 4 ఓవర్లలో కేవలం 123 పరుగులకే చాపచుట్టేసింది.
KKR vs RCB Highlights: మొదటి మ్యాచ్ లో ఘన విజయం సాధించిన బెంగళూరు రెండోమ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. కోల్‌కతా స్పిన్నర్ల ధాటికి చతికిలపడిపోయింది. 205 పరుగుల లక్ష్య ఛేదనలో 17. 4 ఓవర్లలో కేవలం 123 పరుగులకే చాపచుట్టేసింది. ఐపీఎల్ 2023లో నేడు 9వ మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ సీజన్‌లో బెంగళూర్ జట్టు ముంబై ఇండియన్స్‌ను ఓడించడం ద్వారా తమ ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే కోల్‌కతా తన మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. నితీష్ రాణా నేతృత్వంలోని కేకేఆర్ సొంత మైదానంలో ఖాతా తెరవాలని చూస్తోంది.
రెండు జట్ల ప్లేయింగ్-11..
కోల్‌కతా నైట్ రైడర్స్: నితీష్ రాణా (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), రింకు సింగ్, మన్‌దీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సుయాష్ అరోరా.
ఇంపాక్ట్ ప్లేయర్స్: అనుకుల్ రాయ్, మన్‌దీప్ సింగ్, జగదీషన్, డేవిడ్ వైస్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్) , విరాట్ కోహ్లీ, మైకేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాష్ దీప్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, సుయాష్ ప్రభుదేశాయ్.
LIVE Cricket Score & Updates
-
కోల్‌కతా చేతిలో బెంగళూరు చిత్తు..
ఈసాలా కప్ నమదే అంటూ ఐపీఎల్ బరిలోకి దిగిన బెంగళూరు రెండోమ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. కోల్‌కతా స్పిన్నర్ల ధాటికి చేతులెత్తేసింది. 205 పరుగుల లక్ష్య ఛేదనలో 17. 4 ఓవర్లలో కేవలం 123 పరుగులకే ఆలౌటైంది. బ్యాటర్ల సమష్ఠి వైఫల్యంతో ఏకంగా 81 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
-
స్పిన్ వలలో బెంగళూరు బోల్తా
స్పిన్ ఉచ్చులో బెంగళూరు చిక్కుకుంది. 205 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టు 96 పరుగులుకే 8 వికెట్లు కోల్పోయింది. వరుణ్ 3 వికెట్లు తీయగా, సునీల్ నరైన్, సుయాశ్ శర్మ చెరో 2 వికెట్లు నేలకూల్చారు.
-
-
ధాటిగా ఆడుతోన్న విరాట్, ఫాఫ్ డు ప్లెసిస్
2 ఓవర్లు ముగిసేసరికి బెంగళూర్ జట్టు వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది.
-
బెంగళూరు టార్గెట్ 205..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. శార్దూల్ ఠాకూర్ దూకుడు ఇన్నింగ్స్‌తో 68 పరుగులు, రహ్మానుల్లా గుర్బాజ్ అర్ధశతకంతో కోల్ కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 204 పరుగులు చేసింది. దీంతో బెంగళూరు టీం ముందు 205 పరుగుల టార్గెట్ నిలిచింది.
-
దూకుడు పెంచిన శార్దుల్.. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ..
17 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. శార్దూల్ 20 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.
-
-
కష్టాల్లో కోల్‌కతా.. స్వల్ప స్కోర్‌కే పరిమితం?
13 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. గుర్బాజ్ తన అర్ధ సెంచరీని సాధించిన తర్వాత కర్ణ్ శర్మకు బలి అయ్యాడు. ఆ తర్వాతి బంతికి ఆండ్రీ రస్సెల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. నితీష్ రాణా ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. నాలుగో ఓవర్‌లో వరుసగా 2 బంతుల్లో వెంకటేష్ అయ్యర్, మన్‌దీప్ సింగ్‌లను డేవిడ్ విల్లీ అవుట్ చేశాడు. వెంకటేష్ 3 పరుగులు చేయగా, మన్దీప్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.
-
అర్థ సెంచరీ పూర్తి చేసి పెవిలియన్ చేరిన గుర్బాజ్..
11.2 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 4 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. గుర్బాజ్ అర్ధ సెంచరీ పూర్తి చేసి, పెవిలియన్ చేరాడు. నితీష్ రాణా ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. నాలుగో ఓవర్‌లో వరుసగా 2 బంతుల్లో వెంకటేష్ అయ్యర్, మన్‌దీప్ సింగ్‌లను డేవిడ్ విల్లీ అవుట్ చేశాడు. వెంకటేష్ 3 పరుగులు చేయగా, మన్దీప్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.
-
పెవిలియన్ చేరిన కేకేఆర్ సారథి..
7 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా టీం 3 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. నితీష్ రాణా ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. నాలుగో ఓవర్‌లో వరుసగా 2 బంతుల్లో వెంకటేష్ అయ్యర్, మన్‌దీప్ సింగ్‌లను డేవిడ్ విల్లీ అవుట్ చేశాడు. వెంకటేష్ 3 పరుగులు చేయగా, మన్దీప్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.
-
4 ఓవర్లకు కోల్‌కతా స్కోర్..
4 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. నాలుగో ఓవర్‌లో వరుసగా 2 బంతుల్లో వెంకటేష్ అయ్యర్, మన్‌దీప్ సింగ్‌లను డేవిడ్ విల్లీ అవుట్ చేశాడు. వెంకటేష్ 3 పరుగులు చేయగా, మన్దీప్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.
-
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI, ఇంపాక్ట్ ప్లేయర్స్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్) , విరాట్ కోహ్లీ, మైకేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాష్ దీప్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, సుయాష్ ప్రభుదేశాయ్.
-
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI, ఇంపాక్ట్ ప్లేయర్స్..
కోల్‌కతా నైట్ రైడర్స్: నితీష్ రాణా (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), రింకు సింగ్, మన్‌దీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సుయాష్ అరోరా.
ఇంపాక్ట్ ప్లేయర్స్: అనుకుల్ రాయ్, మన్‌దీప్ సింగ్, జగదీషన్, డేవిడ్ వైస్.
-
KKR vs RCB Live Score: టాస్ గెలిచిన బెంగళూర్..
టాస్ గెలిచిన బెంగళూర్ టీం బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
-
KKR vs RCB Live Score: కోల్‌కతా ఖాతా తెరిచేనా?
ఐపీఎల్ 2023లో 9వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి.
Published On - Apr 06,2023 6:25 PM