IPL 2023: హైదరాబాద్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సెంచరీ ప్లేయర్.. ఇక దబిడ దిబిడే..
LSG vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏప్రిల్ 7న ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో తన రెండవ మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఓటమి చవిచూసింది.
Aiden Markram, Sunrisers Hyderabad Team: ఐపీఎల్ 2023 (IPL 2023) ప్రారంభంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)కి అంతగా కలసిరాలేదు. నిజానికి ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ భారీ తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో సీజన్‌లో రెండో మ్యాచ్ ఆడనుంది. ఏప్రిల్ 7న ఎకానా స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. అయితే, లక్నో సూపర్ జెయింట్‌తో మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త అందింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి ఆడమ్ మర్క్రమ్..
లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌కి ఆదిన్ మార్క్‌రామ్ అందుబాటులో ఉంటాడు. ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీజన్ ప్రారంభానికి ముందు ఐడన్ మార్క్‌రామ్‌ను జట్టుకు కెప్టెన్‌గా చేసిన సంగతి తెలిసిందే. కానీ, అతను మొదటి మ్యాచ్‌లో అందుబాటులో లేడు. అయితే, ఇప్పుడు అతను రాబోయే మ్యాచ్‌ల నుంచి మైదానంలో కనిపించనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో మార్క్‌రామ్‌తో పాటు, క్వింటన్ డి కాక్, డేల్ స్టెయిన్, మార్కో జోన్సన్ ఉన్నారు.
Protea Fire Idhi ???@AidzMarkram | #OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/0gdloXk8Kw
— SunRisers Hyderabad (@SunRisers) April 5, 2023
తొలి విజయం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎదురుచూపులు..
తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై రాజస్థాన్ రాయల్స్ (RR) 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేయాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..