CSK IPL 2025: ధోనికి రూ. 4 కోట్లు.. సీ‌ఎస్‌కే రిటైన్ ఆటగాళ్ల లిస్టు ఇదే.. అత్యధిక ధర ఎవరిదంటే.?

|

Oct 31, 2024 | 9:41 PM

చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ జాబితా అధికారికంగా వచ్చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందుగా ఐదుగురి ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది ఫ్రాంచైజీ. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు రూ. 18 కోట్ల చొప్పున..

CSK IPL 2025: ధోనికి రూ. 4 కోట్లు.. సీ‌ఎస్‌కే రిటైన్ ఆటగాళ్ల లిస్టు ఇదే.. అత్యధిక ధర ఎవరిదంటే.?
Csk Ipl 2025 Auction
Follow us on

చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ జాబితా అధికారికంగా వచ్చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందుగా ఐదుగురి ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది ఫ్రాంచైజీ. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు రూ. 18 కోట్ల చొప్పున ఇవ్వనుండగా.. ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరానాకు రూ. 13 కోట్లు.. శివమ్ దూబేకు రూ. 12 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంది సీఎస్‌కే. ఇక అన్ క్యాప్డ్ ప్లేయర్స్ జాబితాలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రూ. 4 కోట్లతో బరిలోకి దిగనున్నాడు. ఈ ఐదుగురికి చెన్నై ఖర్చు రూ. 55 కోట్లు కాగా.. మరో రూ. 65 కోట్లతో మెగా ఆక్షన్‌లోకి అడుగుపెట్టనుంది. కాన్వె, రవీంద్ర, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ లాంటి వారు జట్టులో ఉన్నప్పటికీ వారిపై ఆసక్తిని చూపలేదు. మరి ఎవరిపై చెన్నై సూపర్ కింగ్స్ మెగా ఆక్షన్‌లో తీసుకుంటుందో వేచి చూడాలి.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

ఇవి కూడా చదవండి

రిటైన్ లిస్టు ఇదే..

రవీంద్ర జడేజా – రూ. 18 కోట్ల

రుతురాజ్ గైక్వాడ్ – రూ. 18 కోట్ల

శివమ్ దూబే – రూ. 12 కోట్ల

మతీశ పతిరానా – రూ. 13 కోట్ల

ఎం ఎస్ ధోని – రూ. 4 కోట్ల

మిగిలిన పర్స్: INR 65 కోట్లు (INR 120 కోట్లలో)

రైట్-టు-మ్యాచ్ (RTM): 1

చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు:

రచిన్ రవీంద్ర, అజింక్య రహానె, డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, సమీర్ రిజ్వీ, దీపక్ చాహర్, మహేష్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మన్, తుషార్ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, నిశాంత్ సిద్ధు, మొయిన్ అలీ, మిచెల్ శాంట్నర్, జాదవ్ మండల్, ప్రశాంత్ సోలంకి, ముకేశ్ చౌదరి, సిమర్జీత్ సింగ్, హంగర్గేకర్, అరవెల్లి అవినాశ్.

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..