KKR vs PBKS, IPL 2024: బెయిర్ స్టో మెరుపు సెంచరీ.. చెలరేగిన శశాంక్.. పంజాబ్ రికార్డు ఛేజింగ్

|

Apr 27, 2024 | 7:45 PM

Kolkata Knight Riders vs Punjab Kings: పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ 17వ సీజన్ 42వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన టీ20 క్రికెట్‌ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని పంజాబ్ జట్టు నమోదు చేసింది. కోల్ కతా విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 8 బంతులు మిగిఇ ఉండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి అందుకుంది పంజాబ్

KKR vs PBKS, IPL 2024: బెయిర్ స్టో మెరుపు సెంచరీ.. చెలరేగిన శశాంక్.. పంజాబ్ రికార్డు ఛేజింగ్
Punjab Kings
Follow us on

Kolkata Knight Riders vs Punjab Kings: పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ 17వ సీజన్ 42వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన టీ20 క్రికెట్‌ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని పంజాబ్ జట్టు నమోదు చేసింది. కోల్ కతా విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 8 బంతులు మిగిఇ ఉండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి అందుకుంది పంజాబ్. తద్వారా టీ 20 ఫార్మాట్ లో అత్యధిక స్కోరును ఛేదించిన జట్టుగా రికార్డు పుటల్లోకి ఎక్కింది. పంజాబ్ తరఫున జానీ బెయిర్‌స్టో మెరుపు సెంచరీ సాధించాడు. కేవలం 48 బంతుల్లో 108 నాటౌట్, 8 ఫోర్లు, 9 సిక్స్‌ లు) కోల్ కతా బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడీ ఇంగ్లండ్ బ్యాటర్. అతనికి శశాంక్ సింగ్ (28 బంతుల్లో 68, 2 ఫోర్లు, 8 సిక్స్‌ లు) మంచి సహకారం అందించాడు. అంతకు ముందు ప్రభ్ సిమ్రాన్ సింగ్ (20 బంతుల్లో 54) పంజాబ్ కు మెరుపు అందించాన్ని అందించాడు. దీంతో పంజాబ్ 18.4 ఓవర్లలోనే 262 పరుగుల టార్గెట్ ను అందుకుంది. సెంచరీతో జట్టును గెలిపించిన బెయిర్ స్టోకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.

భారీ లక్ష్య ఛేదనలో ఓపెనింగ్ జోడీ ప్రభాసిమ్రాన్ సింగ్ (ఇంపాక్ట్) ,జానీ బెయిర్‌స్టోలు అదరగొట్టారు. పవర్ ప్లేలో వీరిద్దరూ 5.5 ఓవర్లలో 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత ఆరో ఓవర్ చివరి బంతికి ప్రభాసిమ్రాన్ సింగ్ రనౌట్ అయ్యాడు. ప్రభాసిమ్రన్ 20 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ప్రభ్ తర్వాత రిలే రస్సో రంగంలోకి దిగాడు. రిలే, జానీ బెయిర్‌స్టో రెండో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత రిలే 26 పరుగుల వద్ద ఔటయ్యాడు. రిలే తర్వాత శశాంక్ సింగ్ రంగంలోకి దిగాడు. శశాంక్, బెయిర్‌స్టో జోడీ పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చింది. ఈ జోడీ మూడో వికెట్‌కు 84 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. జానీ 48 బంతుల్లో 9 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 108 పరుగులతో అజేయ సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో బెయిర్‌స్టో రెండో సెంచరీ. శశాంక్ సింగ్ 28 బంతుల్లో 8 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయంగా 68 పరుగులు చేశాడు. కేకేఆర్ నుంచి సునీల్ నరైన్ ఏకైక వికెట్ తీశాడు.

ఇవి కూడా చదవండి

కోల్ కతా ప్లేయింగ్ ఎలెవన్.

ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్ ), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, దుష్మంత చమీర, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా

ఇంపాక్ట్ ప్లేయర్ :

సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, వైభవ్ అరోరా, రహ్మానుల్లా గుర్బాజ్

పంజాబ్ కింగ్స్  ప్లేయింగ్ ఎలెవన్

జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్(కెప్టెన్), రిలీ రోసోవ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

ఇంపాక్ట్ ప్లేయర్ :

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రిషి ధావన్, విధ్వత్ కావరప్ప, శివమ్ సింగ్, ప్రిన్స్ చౌదరి