AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే.. IPLలో కొత్త టీమ్స్‌, మ్యాచ్‌ల సంఖ్య పెంపుపై BCCI కీలక నిర్ణయం!

బీసీసీఐ 2028 సీజన్ నుండి ఐపీఎల్‌లో మ్యాచ్‌ల సంఖ్యను 94కి పెంచాలని పరిశీలిస్తోంది. కొత్త జట్లను చేర్చే ప్రణాళిక లేదు. ఐసీసీతో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 74 మ్యాచ్‌లు ఉన్నాయి. ఎక్కువ మ్యాచ్‌లతో ప్రతి జట్టు సగం హోమ్ గ్రౌండ్‌లో, సగం అవయి గ్రౌండ్‌లో ఆడే అవకాశం ఉంటుంది.

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే.. IPLలో కొత్త టీమ్స్‌, మ్యాచ్‌ల సంఖ్య పెంపుపై BCCI కీలక నిర్ణయం!
Ipl
SN Pasha
|

Updated on: Apr 28, 2025 | 6:57 PM

Share

2028 సీజన్ నుండి ఐపీఎల్ సీజన్‌ను 94 మ్యాచ్‌లకు విస్తరించాలని బీసీసీఐ పరిశీలిస్తోంది. అయితే మ్యాచ్‌ల సంఖ్య పెంచినా కొత్త జట్లను తీసుకొచ్చే అవకాశం అయితే లేదు. 2022లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లను ఐపీఎల్‌లో చేర్చిన బీసీసీఐ, మ్యాచ్‌ల సంఖ్యను 74కు పెంచింది. ప్రస్తుతం సీజన్‌లో మ్యాచ్‌ల సంఖ్యను 84కు పెంచాలని అనుకున్నప్పటికీ అంతర్జాతీయ బిజీ షెడ్యూల్ కారణంగా చివరి నిమిషంలో దాన్ని రద్దు చేశారు. ఐపీఎల్ కోసం FTP (ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్)లో IPL విండోను మార్చి మధ్య నుండి మే చివరి వరకు వచ్చే రెండు సీజన్లకు నిర్ణయించారు.

అయితే రానున్న కాలంలో అంటే 2028 సీజన్‌ నుంచి మ్యాచ్‌ల సంఖ్యను ఏకంగా 94కు పెంచాలని బీసీసీఐ, ఐపీఎల్‌ కమిటీ భావిస్తోంది. ఇదే విషయంపై ఐపీఎల్‌ చైర్మన్ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. “మేం ఐసీసీతో చర్చిస్తున్నాం. అలాగే బీసీసీఐలో కూడా అంతర్గతంగా చర్చిస్తున్నాం. ద్వైపాక్షిక, ఐసీసీ ఈవెంట్లు, ఫ్రాంచైజ్ క్రికెట్ సంబంధించి అభిమానుల ఆసక్తి ఎలా మారుతుందో చూస్తే.. కచ్చితంగా ఐపీఎల్‌ మ్యాచ్‌ల సంఖ్య పెంచాలని అనుకుంటున్నాం.” అని ఆయన అన్నారు.

ఐపీఎల్‌ కోసం షెడ్యూల్‌లో పెద్ద విండో కోరుకుంటున్నాం, దాంతో మ్యాచ్‌ల సంఖ్యను 74 నుంచి 84 లేదా 94కి పెంచవచ్చు. అలా పెంచితేనే.. ప్రతి టీమ్‌ సగం మ్యాచ్‌లు హోం గ్రౌండ్‌లో, సగం మ్యాచ్‌లు ప్రత్యర్థి హోం గ్రౌండ్‌లో ఆడేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి టీమ్‌ మిగతా టీమ్స్‌ రెండేసి మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం ఉంటుంద అని ఆయన అన్నారు. మరి బీసీసీఐ అడగాలే కానీ, ఐసీసీ కచ్చితంగా ఐపీఎల్‌ కోసం ఎక్కువ టైమ్‌ ఇవ్వడం పక్కా. అదే జరిగితే 2028 నుంచి 94 ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూడొచ్చు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త.
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త.