IPL 2026: టార్గెట్ 300 తగ్గేదేలే.! మమ్మల్ని ఓడించే సత్తా ఆ జట్టుకే ఉంది.. కానీ ఈసారి విధ్వంసమే

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఢిల్లీ విధించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ అద్భుత విజయంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏమన్నారో తెలుసుకోండి. అలాగే ఆ జట్టుతోనే తమ నాకౌట్ మ్యాచ్ అని తేల్చి చెప్పాడు.

IPL 2026: టార్గెట్ 300 తగ్గేదేలే.! మమ్మల్ని ఓడించే సత్తా ఆ జట్టుకే ఉంది.. కానీ ఈసారి విధ్వంసమే
Shreyas Iyer

Updated on: Apr 27, 2026 | 11:42 AM

క్రికెట్ అంటేనే అన్ ప్రిడిక్టబుల్. కానీ 264 పరుగులు కొట్టిన జట్టు ఓడిపోతుందని ఎవరైనా ఊహిస్తారా? ఐపీఎల్ 2026 సీజన్‌లో అసాధ్యమనిపించిన రికార్డును పంజాబ్ కింగ్స్ సుసాధ్యం చేసి చూపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు సృష్టించిన విధ్వంసం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచ లీగ్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని(265 పరుగులు) విజయవంతంగా ఛేదించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది.

ఇది చదవండి: ఇది చిటికెడు వేస్తే చాలు.. మందార మొక్కకు వచ్చే తెల్లని పురుగులను తరిమి కొట్టొచ్చు..

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీ (152 పరుగులు) తో నిర్ణీత ఓవర్లలో 264 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంత పెద్ద స్కోరు చూసి పంజాబ్ ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ పంజాబ్ ఓపెనర్లు ప్రియాన్స్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తొలి బంతి నుంచే మెరుపులు మెరిపించారు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 71 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్‌తో మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేశారు.

మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ తన సంతోషాన్ని పంచుకున్నారు. “నిజం చెప్పాలంటే ఈ విజయం గురించి మాట్లాడటానికి మాటలు రావడం లేదు. అంత భారీ టార్గెట్ చూసి నేను భయపడలేదు. కేఎల్ రాహుల్ అంత ఈజీగా షాట్లు కొడుతుంటే, ఈ పిచ్‌పై మేము కూడా భారీ స్కోరు చేయగలమని నాకు నమ్మకం కలిగింది. మా బ్యాటర్లకు నేను ఒక్కటే చెప్పాను.. రెండు ఓవర్ల ముందే మ్యాచ్ ముగించాలని. పవర్ ప్లేలో మా ఓపెనర్లు వేసిన పునాది ఈ విజయానికి కీలకం” అని అయ్యర్ పేర్కొన్నారు.

ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అజేయంగా దూసుకుపోతుండటం చూస్తుంటే, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆ జట్టు ఈసారి కప్పు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఇప్పటిదాకా ఆడిన 19 మ్యాచ్‌లలో పంజాబ్ కేవలం నాలుగు మ్యాచ్‌లలో మాత్రమే ఓడిపోయింది. మూడు RCBతో, ఒకటి RRతో ఉంది. దీంతో 17 మే బెంగళూరుతో జరగబోయే మ్యాచ్.. రెండు జట్లకు కీలకం కానుంది. అలాగే ఈసారి కూడా ఫైనల్ PBKS, RCB మధ్య జరుగుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

ఇది చదవండి: వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఇక చిటికలో పని.. లోపలికి దిగకుండానే ఈజీగా శుభ్రం చేయండిలా.!

Follow Us