AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : క్రికెట్ ఫ్యాన్స్‌కు అలెర్ట్.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్ల సేల్ షురూ.. రేపటి నుంచే బుకింగ్స్

IPL 2026 : ఐపీఎల్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్‌లు ముగింపు దశకు వస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ప్లే ఆఫ్స్, గ్రాండ్ ఫైనల్ మీద పడింది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు బీసీసీఐ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.

IPL 2026 : క్రికెట్ ఫ్యాన్స్‌కు అలెర్ట్.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్ల సేల్ షురూ.. రేపటి నుంచే బుకింగ్స్
Ipl 2026 Playoffs Ticket Sales
Rakesh
|

Updated on: May 19, 2026 | 7:50 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్‌లు ముగింపు దశకు వస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ప్లేఆఫ్స్, గ్రాండ్ ఫైనల్ మీద పడింది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు బీసీసీఐ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాల తేదీలను అధికారికంగా ప్రకటించింది. మే 20వ తేదీ నుంచి టిక్కెట్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి టిక్కెట్ల అమ్మకాల బాధ్యతను డిస్ట్రిక్ట్ బై జొమాటో సంస్థకు అప్పగించారు.

బుకింగ్స్ ఎప్పుడు? ఎవరికి స్పెషల్ ఆఫర్స్?

ప్లేఆఫ్స్ టిక్కెట్లను అభిమానులు దశలవారీగా కొనుగోలు చేయవచ్చు. ముందుగా రూపే కార్డు ఉన్నవారికి బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వీరికి 24 గంటల ముందే అంటే.. మే 20 నుంచే టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయారిటీ విండో సౌకర్యం ఉంటుంది. క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌ల కోసం వీరు ముందే టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. ఇక సామాన్య ప్రజల కోసం మే 21 నుంచి టిక్కెట్లు అందుబాటులోకి వస్తాయి. ఫైనల్, క్వాలిఫైయర్-2 మ్యాచ్‌ల కోసం మే 22న ప్రయారిటీ విండో, మే 23 నుంచి సాధారణ విక్రయాలు మొదలవుతాయి.

ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్లు ఇవే..

ప్రస్తుతానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లేఆఫ్ బెర్త్ కన్ఫాం చేసుకున్నాయి. మిగిలిన ఒక స్థానం కోసం పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఏ జట్టు ఎవరితో తలపడుతుందో తెలియకపోయినా, టిక్కెట్ల కోసం మాత్రం ఫ్యాన్స్ ఇప్పుడే క్యూ కడుతున్నారు.

మ్యాచ్‌లు ఎక్కడ?

ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు వేర్వేరు నగరాల్లో జరగనున్నాయి. మే 26న ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో క్వాలిఫైయర్-1 పోరు జరుగుతుంది. మే 27న చండీగఢ్‌లోని కొత్త పీసీఏ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహిస్తారు. మే 29న క్వాలిఫైయర్-2 మ్యాచ్ కూడా చండీగఢ్‌లోనే జరుగుతుంది. ఇక ఐపీఎల్ 2026 విజేత ఎవరో తేల్చే మహా సంగ్రామం మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అట్టహాసంగా జరగనుంది. జొమాటో యాప్ లేదా ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us