AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: పర్పుల్ క్యాప్ రేసులో భువీ ‘టాప్’.. ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీకి భారీ షాక్

IPL 2026: ఐపీఎల్ 2026లో భువనేశ్వర్ కుమార్ 21 వికెట్లతో పర్పుల్ క్యాప్‌ను కైవసం చేసుకోగా, విరాట్ కోహ్లీ వరుస డకౌట్లతో ఆరెంజ్ క్యాప్ రేసులో వెనుకబడ్డారు. క్లాసెన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు విధ్వంసకర ఫామ్‌లో ఉండటంతో టాప్-2 స్థానాలు వారి దగ్గరే ఉన్నాయి.

IPL 2026: పర్పుల్ క్యాప్ రేసులో భువీ 'టాప్'.. ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీకి భారీ షాక్
Orange Cap Purple Cap
Rakesh
|

Updated on: May 11, 2026 | 7:34 AM

Share

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ బెర్తుల కోసమే కాకుండా, వ్యక్తిగత రికార్డుల కోసం కూడా పోరు రసవత్తరంగా మారింది. ముఖ్యంగా ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేసుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్ మ్యాజిక్‌తో మళ్ళీ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోగా, కింగ్ కోహ్లీకి మాత్రం బ్యాడ్ లక్ వెంటాడుతోంది. మే 10న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌ల తర్వాత ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ విశ్వరూపం చూపించాడు. కేవలం 23 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి ముంబై వెన్ను విరిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో భువీ తన వికెట్ల సంఖ్యను 21కి చేర్చుకున్నాడు. అప్పటివరకు టాప్ ప్లేస్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ (19 వికెట్లు)ను వెనక్కి నెట్టి మళ్ళీ పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కగిసో రబడ (18 వికెట్లు), ప్రిన్స్ యాదవ్ (16 వికెట్లు), ఇషాన్ మలింగ (16 వికెట్లు) టాప్-5లో కొనసాగుతున్నారు.

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఈ సీజన్ మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అవ్వడం కోహ్లీ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అవ్వడంతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఆయన పదో స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం 11 మ్యాచ్‌లలో 379 పరుగులు చేసిన కోహ్లీ కంటే, తక్కువ మ్యాచ్‌లు ఆడిన రాన్ రికెల్టన్ (382 పరుగులు) ముందున్నారు.

ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 494 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆయన వెంటే అభిషేక్ శర్మ 475 పరుగులతో రెండో స్థానంలో ఉండి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు విధ్వంసకర ఫామ్‌లో ఉండటంతో టాప్-2 స్థానాలు వారి దగ్గరే ఉన్నాయి. కోహ్లీ మళ్ళీ ఫామ్‌లోకి వస్తే తప్ప ఆరెంజ్ క్యాప్ రేసులో నిలవడం కష్టమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తప్పు చేశారు గంభీర్.. ఆ ఒక్కడికి చోటిచ్చి ఉంటే ఈజీగా గెలిచేవాళ్లు
తప్పు చేశారు గంభీర్.. ఆ ఒక్కడికి చోటిచ్చి ఉంటే ఈజీగా గెలిచేవాళ్లు
ఇలా చేస్తే ఇంట్లోనే కేఫ్ స్టైల్ కాఫీ.. ఈ మిస్టేక్స్ అస్సలు..
ఇలా చేస్తే ఇంట్లోనే కేఫ్ స్టైల్ కాఫీ.. ఈ మిస్టేక్స్ అస్సలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
ఉద్యోగాల పేరుతో కోట్లు వసూళ్లు, నకిలీ అపాయింట్‌మెంట్లు!
ఉద్యోగాల పేరుతో కోట్లు వసూళ్లు, నకిలీ అపాయింట్‌మెంట్లు!
వీరికి మేలు చేయడానికి కదిలి వస్తున్న భారీ గ్రహాలు.. మీరున్నారా?
వీరికి మేలు చేయడానికి కదిలి వస్తున్న భారీ గ్రహాలు.. మీరున్నారా?
మీ వయసు 20 దాటిందా? ఈ సూత్రాలు పాటిస్తే ఫ్యూచర్‌లో తిరుగుండదు
మీ వయసు 20 దాటిందా? ఈ సూత్రాలు పాటిస్తే ఫ్యూచర్‌లో తిరుగుండదు
కాళ్లకు చెప్పులు లేకుండా నడిస్తే బీపీ తగ్గుతుందా?
కాళ్లకు చెప్పులు లేకుండా నడిస్తే బీపీ తగ్గుతుందా?
పాన్ కార్డులో పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలా..?
పాన్ కార్డులో పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలా..?
'జట్టు నుంచే కాదు, కెప్టెన్సీ పోస్ట్ కూడా పీకేస్తారనుకోలే'
'జట్టు నుంచే కాదు, కెప్టెన్సీ పోస్ట్ కూడా పీకేస్తారనుకోలే'
నీట్ పరీక్షకు వెళ్లే ముందు ఇవి చెక్ చేస్కోండి..!
నీట్ పరీక్షకు వెళ్లే ముందు ఇవి చెక్ చేస్కోండి..!