AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : అభిషేక్ శర్మ, భువీలకు చెక్ పెట్టనున్న కేఎల్ రాహుల్? నేటి మ్యాచ్‌తో టోపీలు ఎవరి తలకెక్కుతాయో?

IPL 2026 : ఐపీఎల్ 2026 ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసు రసవత్తరంగా మారింది. నేటి డీసీ vs సీఎస్‌కే మ్యాచ్ తర్వాత అభిషేక్ శర్మ, భువీల రికార్డులను కేఎల్ రాహుల్, అన్షుల్ కంబోజ్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల వద్ద ఉన్న ఈ గౌరవప్రదమైన టోపీలు, ఇవాళ సాయంత్రానికి చేతులు మారే అవకాశం మెండుగా ఉంది.

IPL 2026 : అభిషేక్ శర్మ, భువీలకు చెక్ పెట్టనున్న కేఎల్ రాహుల్? నేటి మ్యాచ్‌తో టోపీలు ఎవరి తలకెక్కుతాయో?
Ipl 2026
Rakesh
|

Updated on: May 05, 2026 | 8:55 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో జట్ల మధ్య పోరు ఒకెత్తయితే, ఆటగాళ్ల మధ్య వ్యక్తిగత రికార్డుల వేట మరో ఎత్తు. ముఖ్యంగా ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు), పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) కోసం జరుగుతున్న పోటీ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. నేడు (మే 5) ఢిల్లీ క్యాపిటల్స్ (DC), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరగనున్న 48వ మ్యాచ్ ఈ క్యాప్‌ల లెక్కలను తలకిందులు చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల వద్ద ఉన్న ఈ గౌరవప్రదమైన టోపీలు, ఇవాళ సాయంత్రానికి చేతులు మారే అవకాశం మెండుగా ఉంది.

ఆరెంజ్ క్యాప్ రేసులో హోరాహోరీ

ప్రస్తుతం ఐపీఎల్ 2026లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ కెరటం అభిషేక్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 10 మ్యాచ్‌ల్లో 440 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను తన వద్దే ఉంచుకున్నాడు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అతనికి అతి సమీపంలో ఉన్నాడు. రాహుల్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో 433 పరుగులు చేశాడు. అంటే, నేడు చెన్నైపై రాహుల్ కేవలం 8 పరుగులు చేస్తే చాలు.. అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకుంటాడు. రాహుల్ ఉన్న ఫామ్ చూస్తుంటే ఇది చాలా చిన్న విషయమనిపిస్తోంది.

పర్పుల్ క్యాప్ కోసం అన్షుల్ కంబోజ్ పోటీ

వికెట్ల వేటలో కూడా సన్‌రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. భువీ 9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. కానీ, ఇవాళ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అన్షుల్ కంబోజ్ అతనికి గట్టి పోటీ ఇవ్వనున్నాడు. అన్షుల్ కూడా 9 మ్యాచ్‌ల్లో సరిగ్గా 17 వికెట్లే తీశాడు. అయితే భువనేశ్వర్ ఎకానమీ రేటు మెరుగ్గా ఉండటంతో ప్రస్తుతం క్యాప్ అతని వద్దే ఉంది. నేడు ఢిల్లీపై అన్షుల్ కంబోజ్ ఒక్క వికెట్ తీసినా, పర్పుల్ క్యాప్ అధికారికంగా చెన్నై క్యాంప్‌కు చేరుతుంది.

సన్‌రైజర్స్ ఆధిపత్యానికి బ్రేక్ పడుతుందా?

చాలా రోజులుగా ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు రెండూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల వద్దే ఉండటం విశేషం. ఇది జట్టు ప్రదర్శనను ప్రతిబింబిస్తున్నప్పటికీ, నేటి మ్యాచ్ ఫలితం ఈ ఆధిపత్యానికి తెరదించే అవకాశం ఉంది. ఢిల్లీ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది కాబట్టి కేఎల్ రాహుల్ భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. అదే సమయంలో చెన్నై బౌలర్లు తమ పదునైన బౌలింగ్‌తో ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేస్తే పర్పుల్ క్యాప్ రేసులో అన్షుల్ కంబోజ్ అందరికంటే ముందు నిలుస్తాడు.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ పోరు కేవలం రెండు జట్ల మధ్య పాయింట్ల యుద్ధం మాత్రమే కాదు.. వ్యక్తిగత గౌరవాల కోసం జరుగుతున్న పోరు కూడా. మ్యాచ్ ముగిసే సమయానికి ఆరెంజ్ క్యాప్ ఎవరి తల పైన ఉంటుంది? అన్షుల్ కంబోజ్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తాడా? అన్నది అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవేళ ఇవాళ టోపీలు చేతులు మారితే, మళ్ళీ సన్‌రైజర్స్ తన తదుపరి మ్యాచ్‌లో వాటిని తిరిగి ఎలా దక్కించుకుంటుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us