Watch Video : హిట్‌మ్యాన్ కోసం తిలక్ స్పెషల్ గెస్టర్.. రోహిత్ 45 జెర్సీ గౌరవం కాపాడిన తెలుగోడు

Watch Video : ఐపీఎల్ 2026లో పంజాబ్‌పై ముంబై అద్భుత విజయం. తిలక్ వర్మ 75 పరుగులతో మెరవడమే కాకుండా, తన గెలుపును రోహిత్ శర్మకు అంకితం ఇస్తూ చేసిన ‘45’ సెలబ్రేషన్ హైలెట్‌గా నిలిచింది. తిలక్ చేసిన సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch Video : హిట్‌మ్యాన్ కోసం తిలక్ స్పెషల్ గెస్టర్.. రోహిత్ 45 జెర్సీ గౌరవం కాపాడిన తెలుగోడు
Rohit Sharma

Updated on: May 15, 2026 | 8:49 AM

Watch Video : ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముందే తప్పుకున్నా, ముంబై ఇండియన్స్ మాత్రం తన ప్రైడ్‎ను చాటుకుంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరాటంలో ముంబై 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచిన యువ సంచలనం తిలక్ వర్మ.. తన అమోఘమైన ఇన్నింగ్స్‌ను తన తోటి సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మకు అంకితం ఇచ్చాడు. గెలిచిన వెంటనే తిలక్ చేసిన సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రోహిత్ కష్టకాలంలో తిలక్ ఆసరా

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌తో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 26 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసి నిరాశగా వెనుదిరిగాడు. ధర్మశాల పిచ్‌పై రోహిత్ టైమింగ్ కుదరక సతమతమవుతున్న వేళ, తిలక్ వర్మ బాధ్యత తీసుకున్నాడు. లక్ష్య ఛేదనలో ఆఖరి 5 ఓవర్లలో 80 పరుగులు కావాల్సిన దశలో తిలక్ విధ్వంసం మొదలైంది. చాహల్ వేసిన ఓవర్‌లో 20 పరుగులు, మార్కో జాన్సెన్ ఓవర్‌లో 22 పరుగులు సాధించి మ్యాచ్‌ను ముంబై వైపు తిప్పేశాడు. ఆఖరి ఓవర్‌లో బార్ట్లెట్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది ఒక బంతి మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు.

సెలబ్రేషన్ అదిరింది.. రోహిత్ ఫిదా

విజయం ఖాయమయ్యాక తిలక్ వర్మ గాలిలోకి ఎగిరి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా డగౌట్ వైపు చూపిస్తూ తన వేళ్లతో 45 (రోహిత్ జెర్సీ నంబర్) అని సైగ చేశాడు. తన ఫామ్ లేమితో బాధపడుతున్న సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మను ఉత్సాహపరిచేందుకే తిలక్ ఈ పని చేశాడు. ఇది చూసిన రోహిత్ మొహంలో చిరునవ్వు చిందించడమే కాకుండా, లేచి నిలబడి చప్పట్లతో తన ప్రియశిష్యుడిని అభినందించాడు. ఈ హృదయానికి హత్తుకునే దృశ్యం ముంబై అభిమానులను ఖుషీ చేస్తోంది.

పంజాబ్ కొంపముంచిన ముంబై

ముంబై గెలుపుతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. రాజస్థాన్ రాయల్స్, సీఎస్కే జట్లు ఒక్క పాయింట్ వెనుకే ఉన్నాయి. ముంబైకి కోల్పోయేది ఏమీ లేకపోవడంతో భయం లేకుండా ఆడి పంజాబ్ నోటికాడ ముద్దను లాగేసుకుంది. బుమ్రా కెప్టెన్సీలో ముంబై కుర్రాళ్ళు పంజాబ్ నరాలకు పరీక్ష పెట్టారు. ఇప్పుడు నాలుగో ప్లే ఆఫ్స్ స్థానం కోసం పోటీ రసవత్తరంగా మారింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us