
క్రికెట్ అంటేనే భావోద్వేగాల కలయిక. ముఖ్యంగా ఐపీఎల్ వంటి హై-ప్రొఫైల్ టోర్నీలో ప్రతి వికెట్ ఒక సెలబ్రేషన్. కానీ, ఆ సెలబ్రేషన్ హద్దులు దాటితే ఎలా ఉంటుందో కైల్ జేమీసన్ తాజా ఘటన మనకు గుర్తుచేస్తోంది. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఒక వివాదానికి వేదికైంది.
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ పేసర్ కైల్ జేమీసన్ వేసిన ఒక పదునైన యార్కర్‌కు రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అద్భుతాలు చేస్తున్న వైభవ్ వికెట్ తీయగానే, జేమీసన్ ఎమోషన్‌ను ఆపుకోలేకపోయాడు. వైభవ్ వైపు దూసుకెళ్తూ, చాలా దగ్గరగా నిలబడి అగ్రెసివ్‌గా చప్పట్లు కొడుతూ, కోపంగా చూస్తూ సెండ్-ఆఫ్ ఇచ్చాడు. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్, చిన్న పిల్లాడైన వైభవ్‌పై అంత దూకుడు ప్రదర్శించడం అభిమానులకు, మాజీ క్రికెటర్లకు రుచించలేదు.
ఈ ఘటనపై ఐపీఎల్ మ్యాచ్ రెఫరీ రాజీవ్ సేథ్ సీరియస్ అయ్యారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోని ఆర్టికల్ 2.5ని జేమీసన్ ఉల్లంఘించినట్లు తేలింది. ఇది ప్లేయర్ల మధ్య గొడవలను ప్రేరేపించేలా ఉందని భావించి, జేమీసన్‌కు ఒక డెమెరిట్ పాయింట్ ఇవ్వడంతో పాటు అధికారికంగా హెచ్చరించారు. జేమీసన్ కూడా తన తప్పును అంగీకరించి శిక్షను స్వీకరించాడు.
ఒక 31 ఏళ్ల అనుభవజ్ఞుడైన బౌలర్, 15 ఏళ్ల కుర్రాడిని అవుట్ చేసి అంతలా సంబరాలు చేసుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో బౌలర్లలో ఎంతటి భయాన్ని నింపాడో! ఈ సీజన్‌లో ఇప్పటికే దాదాపు 400 పరుగులు చేసిన వైభవ్, ఫ్యూచర్ స్టార్‌గా ఎదిగాడు. జేమీసన్ ప్రవర్తనను ప్రియాంక్ పాంచల్ లాంటి క్రికెటర్లు తప్పుబట్టారు. “ఒక చిన్న పిల్లాడిపై అంత అగ్రెషన్ చూపడం మంచి పద్ధతి కాదు” అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా, ఈ ఘటన ఐపీఎల్‌లో పోటీ ఏ స్థాయిలో ఉందో మరోసారి చాటిచెప్పింది.
An in-swinging yorker 😲🔥
🎥 Kyle Jamieson gets Vaibhav Sooryavanshi early 👊
Wait for the celebration 👀
Updates ▶️ https://t.co/6OOjzHtZiD#TATAIPL | #KhelBindaas | #RRvDC | @DelhiCapitals pic.twitter.com/6vxJ5ahlb3
— IndianPremierLeague (@IPL) May 1, 2026
Also Read: ఆ ‘నో లుక్ సిక్స్’ ఏంటీ బ్రో.! పిచ్చోళ్లయిపోయారంతా.. SRHకి మరో ఆణిముత్యం దొరికేశాడోచ్..