CSK Captain: ఏరికోరి తెచ్చుకుని మరీ శాంసన్‌కు హ్యాండిచ్చిన చెన్నై టీం.. కెప్టెన్‌గా ఎవరంటే?
CSK Captain: గత సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ చెన్నై కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కానీ, గాయం కారణంగా అతను జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత ధోనీ జట్టు పగ్గాలు చేపట్టాడు. ఈసారి, ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్‌ను బదిలీ చేసింది. దీంతో అతనినే కెప్టెన్‌గా నియమిస్తారని అంతా ఊహించారు.

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు అన్ని 10 ఫ్రాంఛైజీలు తమ రిటైన్ చేసుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. ఈ రిటెన్షన్ ప్రక్రియ తర్వాత, ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓ కీలక ప్రకటన చేసింది.
CSK జట్టు తదుపరి సీజన్‌కు తమ కెప్టెన్‌ను ప్రకటించింది. ఈ బాధ్యతలను ఎం.ఎస్. ధోని లేదా కొత్తగా జట్టులోకి ట్రేడ్ అయిన స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ తీసుకోబోవడం లేదు.
రుతురాజ్ గైక్వాడ్‌కు తిరిగి పగ్గాలు..
ఐపీఎల్ 2026 సీజన్ కోసం CSK సారథ్య బాధ్యతలను మరోసారి రుతురాజ్ గైక్వాడ్ చేతుల్లోకి అప్పగించారు.
గత సీజన్‌లో (IPL 2025) రుతురాజ్ CSK కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కానీ గాయం కారణంగా మధ్యలో తప్పుకోవడంతో, ఆ సమయంలో ధోని తిరిగి జట్టు పగ్గాలు చేపట్టాడు.
LEAD THE WAY, CAPTAIN RUTURAJ GAIKWAD!💪🦁#WhistlePodu pic.twitter.com/EawvX5k2yI
— Chennai Super Kings (@ChennaiIPL) November 15, 2025
ఈసారి, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ CSKలోకి ట్రేడ్ అయిన తర్వాత, అతనే కెప్టెన్ అవుతాడనే ఊహాగానాలు వచ్చాయి.
అయితే, CSK యాజమాన్యం ఆ ఊహాగానాలకు తెరదించుతూ, తిరిగి యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పైనే నమ్మకం ఉంచింది.
రిటైన్, రిలీజ్ జాబితా..
రిటైన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, CSK ప్రస్తుత జట్టులో కేవలం 15 మంది ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. ఫ్రాంచైజీ ఇప్పుడు మినీ-వేలంలో 10 స్లాట్‌లను కలిగి ఉంది. చెన్నై రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితాను ఓసారి చూద్దాం..
రిటైన్ చేసిన ఆటగాళ్లు: ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మ్హత్రే, డెవాల్డ్ బ్రూయిస్, ఉర్విల్ పటేల్, శివమ్ దూబే, రామకృష్ణ ఘోష్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, నాథన్ ఎల్లిస్, అన్షుల్ కాంబోజ్, జామీ ఓవర్టన్, గుర్జాప్‌నీత్ సింగ్, సంత్రా అహ్మద్, సంత్రా అహ్మద్, సంత్రా అహ్మద్.
విడుదల చేసిన ఆటగాళ్లు: మతిషా పతిర్నా, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వంశ్ బేడీ, ఆండ్రీ సిద్ధార్థ్, విజయ్ శంకర్, దీపక్ హుడా, కమలేష్ నాగర్‌కోటి, సామ్ కర్రాన్, రవీంద్ర జడేజా (ఇద్దరూ ట్రేడ్), రవిచంద్రన్ అశ్విన్ (రిటైర్డ్).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




