AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: కావ్యా పాప రూ. 23 కోట్ల ప్లేయర్‌కు ఊహించని షాక్.. కెరీర్ క్లోజ్ కానుందా?

SRH PLayer Heinrich Klaasen: ఐపీఎల్ 2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతోన్న క్లాసెన్.. ప్రస్తుతం అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అలాగే, ఎస్‌ఆర్‌హెచ్ జట్టు కూడా వరుసగా ఓటమిపాలవుతూ ప్లే ఆఫ్స్ నుంచి దూరంగా వెళ్తోంది. ఈ క్రమంలో క్లాసెన్‌కు బిగ్ షాక్ తగిలింది.

IPL 2025: కావ్యా పాప రూ. 23 కోట్ల ప్లేయర్‌కు ఊహించని షాక్.. కెరీర్ క్లోజ్ కానుందా?
Srh
Venkata Chari
|

Updated on: Apr 07, 2025 | 8:39 PM

Share

SRH PLayer Heinrich Klaasen Left Out Of South Africa’s Central Contract: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. ఎందుకంటే, దక్షిణాఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో 18 మంది ఆటగాళ్లలో అతని పేరును చేర్చలేదు. క్లాసెన్ జనవరి 2024లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. మునుపటి సైకిల్‌లో అతను వైట్ బాల్ కాంట్రాక్టులో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో భవిష్యత్తులో అతను టీ20 లీగ్‌లు మాత్రమే ఆడే ఛాన్స్ ఉంది. రాబోయే కాలంలో తుది నిర్ణయం తీసుకుంటామని క్రికెట్ దక్షిణాఫ్రికా తెలిపింది.

మిల్లర్, డస్సాన్ లకు హైబ్రిడ్ కాంట్రాక్ట్..

గత సంవత్సరం వైట్ బాల్ కాంట్రాక్టు మాత్రమే పొందిన డేవిడ్ మిల్లర్ ఈసారి హైబ్రిడ్ కాంట్రాక్టులో చేరాడు. అదే సమయంలో, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ కూడా అదే కాంట్రాక్టును పొందాడు. ఈ ఒప్పందం కారణంగా, అతను ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐసీసీ ఈవెంట్‌లలో మాత్రమే ఆడగలడు.

18 మంది ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాలో లిజాద్ విలియమ్స్ కూడా ఉన్నాడు. ఈ సంవత్సరం మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి నుంచి అతను ఆటకు దూరంగా ఉన్నాడు. ఆల్ రౌండర్ సెనురాన్ ముత్తుసామి, 18 ఏళ్ల ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ క్వేనా మ్ఫాకా తొలిసారిగా జట్టులోకి వచ్చారు. క్రికెట్ దక్షిణాఫ్రికా కాంట్రాక్ట్ అప్‌గ్రేడ్‌లలో భాగంగా డేవిడ్ బెడింగ్‌హామ్, వియాన్ ముల్డర్, కైల్ వెర్రెయిన్‌లను జట్టులోకి చేర్చింది. నాండ్రే బెర్గర్ కూడా చోటు దక్కించుకున్నాడు. అయితే, అతను గాయం నుంచి కోలుకుంటున్నందున అతను మొత్తం సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా..

టెంబా బావుమా, డేవిడ్ బెడింగ్‌హామ్, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వేనా మ్ఫాకా, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, లుంగి ఎన్‌గిడి, ట్రియాన్‌టన్ రబాడా, ట్రియాన్‌టన్ రబాడా, వెర్రేన్నే, లిజాడ్ విలియమ్స్

హైబ్రిడ్ కాంట్రాక్ట్: డేవిడ్ మిల్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..