Vaibhav Suryavanshi: 10వ తరగతిలోకి ఎంటరైన ఐపీఎల్ సెన్సేషన్.. వైభవ్ సూర్యవంశీ స్కూల్ ఫీజు ఎంతో తెలుసా?
Vaibhav Suryavanshi School Fees: ఐపీఎల్ యువ స్టార్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం తన చదువుకు సంబంధించి వార్తల్లో నిలుస్తున్నాడు. అతను CBSE 10వ తరగతిలో ఫెయిల్ అయ్యాడని పుకార్లు వ్యాపించాయి. అయితే, అతను ఈ సంవత్సరం 10వ తరగతిలో చేరాడు.

Vaibhav Suryavanshi School Fees: వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల వయసులో భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా మారాడు. ఐపీఎల్ 2025 (IPL 2025)లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నప్పుడు, అతను 35 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. వైభవ్ సూర్యవంశీ తన క్రీడలకు మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితానికి కూడా వార్తల్లో నిలిచాడు. దీంతో ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ చదువుల గురించి మాట్లాడితే CBSE 10వ తరగతి బోర్డు పరీక్షలలో ఫెయిల్ అయ్యాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, అతను ఈ సంవత్సరం 10వ తరగతి చదవనున్నాడు. కానీ, వైభవ్ ఎక్కడ చదువుతున్నాడో, అతని స్కూల్ ఫీజు ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం..
వైభవ్ సూర్యవంశీ స్కూల్ ఫీజు ఎంత?
వైభవ్ సూర్యవంశీ బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా తాజ్‌పూర్ గ్రామానికి చెందినవాడు. చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు. వైభవ్ సూర్యవంశీ సమస్తిపూర్ జిల్లాలోని తాజ్‌పూర్‌లోని మోడెస్టీ స్కూల్ విద్యార్థి, ఈ సంవత్సరం 10వ తరగతిలో చేరాడు. అంటే అతను 2026లో 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరవుతాడు. మీడియా నివేదికల ప్రకారం, మోడెస్టీ స్కూల్ అడ్మిషన్ ఫీజు లేదు. ట్యూషన్ ఫీజుగా ప్రతినెలా రూ. 2500లు చెల్లించాల్సి ఉంది. అలాగే, ఎగ్జామినేషన్ ఫీజుల కింద రూ. 1000లు, ఆక్టివిటీస్ ఫీజులో భాగంగా రూ. 3000లు చెల్లించాలి. వైభవ్ ఉదయాన్నే నిద్రలేచి చదువులో మునిగిపోతాడు. వైభవ్ రోజు ట్యూషన్ తరగతులతో ప్రారంభమవుతుందని అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇందుకోసం స్పెషల్‌గా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
వైభవ్ సూర్యవంశీ ప్రధాన దృష్టి క్రికెట్‌పైనే పెట్టాడు. కానీ, అతను తన చదువుపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతున్నాడు. అతను ఇటీవలే 9వ తరగతి పాసయ్యాడు. వైభవ్ కథ ప్రత్యేకమైనది. ఎందుకంటే అతను ఇంత చిన్న వయస్సులోనే చదువు, క్రికెట్ మధ్య అద్భుతమైన సమతుల్యతను సృష్టించాడు. అతను ఉదయాన్నే నిద్రలేచి, ట్యూషన్ తీసుకుని, క్రికెట్ ప్రాక్టీస్‌కు బయలుదేరుతాడు. అయితే, వైభవ్ క్రికెట్ ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తాడు. కాబట్టి, అతని కుటుంబం చదువు కోసం పెద్దగా ఒత్తిడి చేయదు.
ఐపీఎల్ వేలంలో కోటీశ్వరుడిగా బుడ్డోడు..
ఐపీఎల్ 2025 మెగా వేలం సమయంలో వైభవ్ సూర్యవంశీ వెలుగులోకి వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత, వైభవ్ తన అరంగేట్ర మ్యాచ్‌లో మొదటి బంతికే సిక్స్ కొట్టాడు. తరువాత 2025 ఏప్రిల్ 28న, గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా IPLలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారతీయుడిగా నిలిచాడు. వైభవ్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 5 మ్యాచ్‌లు ఆడి 31.00 సగటుతో 155 పరుగులు చేశాడు. ప్రత్యేకత ఏమిటంటే అతని స్ట్రైక్ రేట్ 209.45గా ఉంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








