IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మ్యాచ్‌ల రీస్టార్ట్ అప్పుడేనా..?
ఇండో-పాక్ మధ్య టెన్షన్స్‌తో పాటు.. కోట్లాదిమంది క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మరో అంశం.. ఐపీఎల్ రీస్టార్ట్ అయ్యేదెప్పుడు అని..! ఆ గుడ్‌న్యూస్ కూడా రెడీగా ఉంది. కాకపోతే సీల్డ్ కవర్‌లో దాక్కుంది. దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025) ను రీస్టార్ట్ చేసేందుకు తీవ్ర కసరత్తు జరుగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో కొత్త షెడ్యూల్‌పై దృష్టి సారించింది బీసీసీఐ. ఆదివారం కూడా స్టేక్ హోల్డర్స్‌తో సమావేశమై మంతనాలు జరిపింది. కానీ.. ఎటువంటి నిర్ణయానికీ రాలేకపోయింది. డేట్ ఫిక్సయింది.. ప్రభుత్వం నుంచి పర్మిషన్ కోసమే వెయిటింగ్.. అనే సంకేతాలైతే ఉన్నాయి.
అనేకమంది విదేశీ ప్లేయర్స్ వాళ్లవాళ్ల దేశాలకు వెళ్లిపోవడం.. ప్రాంచైజీలకు తలనొప్పిగా మారింది. ప్లేయర్స్ మళ్లీ తిరిగొస్తారా అన్న గ్యారంటీ కూడా లేదు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఈనెల 15 లేదా 16న ఐపీఎల్ రీస్టార్ట్ అవుతుంది. కాకపోతే.. ఈ తేదీలను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. పైగా వేదికల సంఖ్యను కూడా కుదించక తప్పేలా లేదు. అంత సవ్యంగా జరిగితే.. ఫైనల్ ఫైట్ మే 30న లేదంటే జూన్ 1న జరిగే అవకాశం ఉందని సమాచారం.
ధర్మశాలలో మ్యాచ్ అర్థంతరంగా ఆగిపోవడం.. టోటల్ ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడటం.. క్రికెట్ ఫ్యాన్స్‌ని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. కాకపోతే వారం రోజుల్లో తిరిగి మొదలెడతాం అని బీసీసీఐ చెప్పడం అప్పట్లో పెద్ద రిలీఫ్. ఈ సీజన్‌లో ఇంకా 16 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వ ఆమోదం అనంతరం.. తదుపరి షెడ్యూల్ విడుదల కానుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




