IPL 2025: ఎంత కష్టమొచ్చింది సామీ.. ఐపీఎల్ 2025 ముందే కోట్లలో నష్టం.. ఎందుకంటే

|

Mar 20, 2025 | 6:11 PM

IPL 2025కు ముందుగానే అనేక జట్లకు షాకులు తగులుతున్నాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, SRH, RCB, లక్నో సూపర్ జెయింట్స్, KKR జట్లలోని కీలక ఆటగాళ్ళు గాయాలతో బాధపడుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

IPL 2025: ఎంత కష్టమొచ్చింది సామీ.. ఐపీఎల్ 2025 ముందే కోట్లలో నష్టం.. ఎందుకంటే
Ipl 2025 All Team Captain N
Follow us on

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 ప్రారంభం కాబోతోంది. అయితే సీజన్ స్టార్ట్ కాకముందే కీలక ప్లేయర్స్‌కు గాయాలు కావడంతో పలు జట్లు తలలు పట్టుకున్నాయి. అన్ని జట్ల కంటే.. ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో అత్యధికంగా గాయాలతో సతమతమవుతున్న జట్టుగా నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ అల్లా గజనఫర్ బ్యాక్ ఫ్రాక్చర్ కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకోగా.. తన స్థానంలో ముంబై ఇండియన్స్ మరో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్‌ను జట్టులోకి తీసుకుంది. ఆ తర్వాత లెజార్డ్ విలియమ్స్ కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగగా.. అతడి స్థానాన్ని సౌతాఫ్రికా ఆల్-రౌండర్ కార్బిన్ బాస్‌తో రీప్లేస్ చేశాడు. అటు ముంబై ఇండియన్స్‌కు మరో పెద్ద సమస్య జస్ప్రీత్ బుమ్రా బ్యాక్ ఇంజురీ. అతడు గాయం నుంచి కోలుకునేందుకు మరింత సమయం పట్టేలా ఉంది.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా గాయాలు వెంటాడుతున్నాయి. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ వరుసగా రెండు సీజన్లలో వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఇక మిచెల్ స్టార్క్ యాంకెల్ ఇంజురీ, కేఎల్ రాహుల్ కొన్ని మ్యాచ్‌లు మిస్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఢిల్లీ ఈ సమస్యలతో సతమతమవుతోంది. SRH జట్టుకు బ్రెడన్ కార్సే ఇంజురీ కారణంగా వయాన్ మల్డర్‌ను చేర్చుకుంది. అటు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ యాంకెల్ ఇంజురీ నుంచి కోలుకుంటున్నాడు. RCBకి జాస్ హజిల్‌వుడ్, జాకబ్ బెథెల్ గాయాలతో సతమతమవుతోంది. హజిల్‌వుడ్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. జాకబ్ బెథెల్ గురించి ఇంకా స్పష్టత లేదు. లక్నో సూపర్ జెయింట్స్‌కు మయాంక్ యాదవ్ లోయర్ బ్యాక్ ఇంజురీతో బాధపడుతున్నాడు. ఇక మిచెల్ మార్ష్ బ్యాట్స్‌మెన్‌గానే ఆడతాడు. KKRకి హెండ్రిక్ నోకియా, ఉమ్రాన్ మాలిక్ గాయాలు వెంటాడుతున్నాయి. గుజరాత్, పంజాబ్ కింగ్స్ జట్లలో కూడా గాయాల సమస్యలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..