
IPL 2025 38వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లందరూ రెండో ఇన్నింగ్స్‌లో నల్లటి చేతికి బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి దిగారు. దీన్ని గమనించిన అభిమానులు CSK ఆటగాళ్లు నల్లటి చేతి బ్యాండ్లతో ఎందుకు ఆడుతున్నారో తెలియక అయోమయంలో పడ్డారు. దీని గురించి ఇంతకు ముందు ఎవరికీ ఎటువంటి సమాచారం లేదు. కానీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే, CSK ఆటగాళ్ళు నల్లటి చేతి బ్యాండ్లు ఎందుకు ధరించారో వ్యాఖ్యాతలు వెల్లడించారు. మ్యాచ్ మధ్యలో, న్యూజిలాండ్‌కు చెందిన సీఎస్కే ఓపెనర్ డెవాన్ కాన్వే తండ్రి మరణించారని కామెంటేటర్లు ప్రకటించారు. మ్యాచ్ అనంతరం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో హర్ష భోగ్లే మాట్లాడుతూ, డెవాన్ కాన్వే తండ్రి మరణించారని వెల్లడించారు. అయితే, కాన్వే తన దేశానికి వెళ్లిపోయాడా? లేదా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ డెవాన్ కాన్వే న్యూజిలాండ్‌కు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ విచారకరమైన సమయంలో కాన్వే తన కుటుంబంతో ఉండాలి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ సమాచారాన్ని తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.’ ఈ క్లిష్ట సమయంలో మేము డెవాన్ కాన్వే కుటుంబానికి అండగ నిలబడతాం’ అని ప్రకటించింది.
ఏప్రిల్ 11న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కాన్వే తన చివరి మ్యాచ్ ఆడాడు. చేపాక్ గ్రౌండ్‌లో జరిగిన ఆ మ్యాచ్ తర్వాత కాన్వే జట్టు ప్లేయింగ్ ఎలెవెన్‌లో కనిపించలేదు. ఇప్పుడు తండ్రిని కోల్పోయిన కాన్వే మళ్ళీ ఐపీఎల్ లో కనిపిస్తాడా లేదా అనేది అస్పష్టంగా ఉంది. ఎందుకంటే ఈ సీజన్‌లో కాన్వే ప్రదర్శన కూడా అంతంతమాత్రంగానే ఉంది. అందువల్ల డెవాల్డ్ బ్రెవిస్ అతని స్థానంలో ఆడే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుంది.
Standing with Devon Conway and his family in this difficult time of his father’s passing.
Our sincerest condolences. pic.twitter.com/AZi3f5dV7i
— Chennai Super Kings (@ChennaiIPL) April 21, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..