CSK vs RCB IPL 2024: చెపాక్‌లో ధోనికి తిరుగులేదా? CSK vs RCB హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే

Chennai Super Kings vs Royal Challengers Bangalore Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్సీజన్ 17 ప్రారంభానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శుక్రవారం (మార్చి 22) నుంచి ప్రారంభమయ్యే ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి

CSK vs RCB IPL 2024: చెపాక్‌లో ధోనికి తిరుగులేదా? CSK vs RCB హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే
Chennai Super Kings vs Royal Challengers Bangalore

Updated on: Mar 21, 2024 | 3:28 PM

Chennai Super Kings vs Royal Challengers Bangalore Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్సీజన్ 17 ప్రారంభానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శుక్రవారం (మార్చి 22) నుంచి ప్రారంభమయ్యే ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అంటే చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో తొలి మ్యాచ్ ఆడడం ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఎంఏ చిదంబరం మైదానంలో సీఎస్‌కే జట్టు కు మంచి రికార్డులున్నాయి. ముఖ్యంగా CSK ఈ గ్రౌండ్‌ లో RCB చేతిలో కేవలం ఒక్క సారి మాత్రమే ఓడిపోయింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్లు ఇప్పటి వరకు 8 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 7 సార్లు గెలిచింది. RCB జట్టు ఒకసారి మాత్రమే విజయం సాధించింది. అది కూడా 2008లో. దీని తర్వాత చెన్నైలో CSKపై RCB విజయం సాధించలేదు. CSK జట్టు తమ సొంత మైదానంలో ఇప్పటి వరకు 64 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 18 మ్యాచ్‌ల్లో ఓడి 46 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చిదంబరం మైదానం కొట్టిన పిండిలాంటిదంటారు ఫ్యాన్స్.

అదే సమయంలో ఆర్‌సిబి జట్టు చెన్నై మైదానంలో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడింది. 5 మ్యాచ్‌ల్లో గెలిచి 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే, ఈ ఫీల్డ్‌లో టాస్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సీఎస్‌కే ఇక్కడ ఎక్కువ మ్యాచ్‌లు గెలవడంలో టాస్ ప్రముఖ పాత్ర పోషించింది. చెన్నైలో ధోనీ సేన గెలిచిన 46 మ్యాచ్‌ల్లో 30 మ్యాచ్‌ల్లో సీఎస్‌కే మొదట బ్యాటింగ్ చేయడం గమనార్హం. కాబట్టి, ఇక్కడ CSKదే పైచేయి అయినప్పటికీ, టాస్ విన్ అయితే ఆశ్చర్యకరమైన ఫలితాలను ఆశించొచ్చు. కాగా సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్ శుక్రవారం రాత్రి 7.30కు షురూ కానుంది.

ఇవి కూడా చదవండి

ప్రాక్టీసులో ఆర్సీబీ ఆటగాళ్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..