Mumbai Indians vs Chennai Super Kings : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు చెలరేగారు. మొదట ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ( 40 బంతుల్లో 69, 5ఫోర్లు, 5 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత సూపర్ ఫామ్ లో ఉన్న శివమ్ దూబే శివాలెత్తాడు. ముంబై బౌలర్లను చితక బాదుతూ కేవల 38 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక చివర్లో వచ్చిన మహేంద్ర సింగ్ ధోని హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగాడు. 4 బంతుల్లో 20 పరుగులు చేసిన ధోని చెన్నై స్కోరును 200 పరుగులు దాటించాడు. మొత్తానికి చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానే (5), రచిన్ రవీంద్ర (21) నిరాశపర్చారు. మిచెల్ (17) కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా.. కొయెట్జి, శ్రేయస్ గోపాల్ చెరో వికెట్ తీశారు.
Ravi Shastri in the commentary box 🤝 MS Dhoni at Wankhede 🏟️
ఇవి కూడా చదవండిWe have seen this before 🤩#MIvCSK #TATAIPL #IPLonJioCinema #MSDhoni | @RaviShastriOfc pic.twitter.com/jAUpGEjtbC
— JioCinema (@JioCinema) April 14, 2024
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, శ్రేయస్ గోపాల్, జెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వల్
సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, నమన్ ధీర్, నెహాల్ వధేరా, హార్విక్ దేశాయ్
రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్.
మతీషా పతిరణ, నిశాంత్ సింధు, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ, షేక్ రషీద్
.@ChennaiIPL skipper Ruturaj launches it into the crowd 💪🔥#MIvCSK #TATAIPL #IPLonJioCinema #IPLinTamil pic.twitter.com/KkP3VHIvdH
— JioCinema (@JioCinema) April 14, 2024
Dube not leaving the shift key today, IYKYK 😉😏#MIvCSK #TATAIPL #IPLonJioCinema #IPLinBhojpuri pic.twitter.com/vHZH0TWe4q
— JioCinema (@JioCinema) April 14, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..