రియాన్ పరాగ్.. ఈ పేరు వింటే ఓవరాక్షనే ఎక్కువగా గుర్తుకు వస్తుంది. ఆట కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడీ యంగ్ క్రికెటర్. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రోల్ అయ్యాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలోనూ రియాన్ ఆట కంటే అతని ఓవరాక్షనే ఎక్కువగా వార్తల్లోనిలిచేది. అయితే ప్రస్తుత సీజన్ లో రియాన్ పరాగ్ బ్యాట్ మాత్రమే మాట్లాడుతోంది. కొద్ది రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమైన అతను ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గురువారం (మార్చి 28) జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. రియాన్ పరాగ్ 84 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఈ విజయాన్ని సాధించింది. పరాగ్ క్రీజులోకి వచ్చేసరికి రాజస్థాన్ 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ఆ జట్టు 36 పరుగుల వద్ద మూడో వికెట్ పడింది. అయితే, రాజస్థాన్ ఇప్పటికీ 185 పరుగులు చేసిందంటే దానికి కారణం రియాన్ పరాగ్. అస్సాంకు చెందిన 22 ఏళ్ల యువ బ్యాటర్ కేవలం 45 బంతుల్లో 84 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లో ఏకంగా 25 పరుగులు రాబట్టాడు. రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన పరాగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. క్లిష్ట పరిస్థితులతో పోరాడుతూ ఈ ఇన్నింగ్స్‌ను ఆడినట్లు మ్యాచ్ అనంతరం రియాన్ పరాగ్ ఎమోషనల్ అయ్యాడు.
‘నేను గత 3 రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. మంచం మీద నుండి లేవడం కూడా కష్టంగా మారింది. పెయిన్ కిల్లర్స్ తో రోజంతా నెట్టుకొస్తున్నాను. ఈ మ్యాచ్‌లో ఆడి జట్టు విజయానికి దోహదపడడం సంతృప్తికరంగా ఉంది’ అని రియాన్ పరాగ్ చెప్ఉకొచ్చాడు.
What made Riyan cry, batting alongside Ash Anna and more only on the first-ever episode of our Royals TV feat. the one and only @yuzi_chahal 🎙️💗 pic.twitter.com/bYw0imDF5j
— Rajasthan Royals (@rajasthanroyals) March 29, 2024
ఐపీఎల్ 2019 నుంచి రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. అప్పట్లో రాజస్థాన్ అతడిని రూ.20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. వరుసగా 3 సంవత్సరాలు ఆజట్టుకే ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నాడు. వరుసగా అవకాశాలు లభించిన అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. 2022 సీజన్‌కు ముందు మెగా వేలం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ మరోసారి పరాగ్ పై నమ్మకముంచింది. ఏకంగా 3.80 కోట్లకు కొనుగోలు చేసింది.. రెండు సీజన్లలో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు మూడో సీజన్‌లో తన సత్తాకు తగ్గట్టుగా ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో ర్యాన్ 43 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..