IPL 2024: యాడ దొరికిన సంతరా! 3 మ్యాచుల్లో 115 రన్స్.. ఒకే వికెట్.. RCBకి భారంగా 11 కోట్ల బౌలర్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) సీజన్ 17లో ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మూడు మ్యాచ్‌లు ఆడింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా, 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ ఓటములకు ప్రధాన కారణం నిస్సందేహంగా RCB జట్టు బౌలర్లే.

IPL 2024: యాడ దొరికిన సంతరా! 3 మ్యాచుల్లో 115 రన్స్.. ఒకే వికెట్.. RCBకి భారంగా 11 కోట్ల బౌలర్‌
Royal Challengers Bengaluru

Updated on: Mar 30, 2024 | 6:39 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) సీజన్ 17లో ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మూడు మ్యాచ్‌లు ఆడింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా, 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ ఓటములకు ప్రధాన కారణం నిస్సందేహంగా RCB జట్టు బౌలర్లే. ముఖ్యంగా RCB పేసర్ అల్జారీ జోసెఫ్ కేవలం మూడు మ్యాచ్‌ల్లో 100కి పైగా పరుగులు చేశాడు. CSKతో జరిగిన తొలి మ్యాచ్‌లో అల్జారీ 3.4 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చాడు. కానీ అతనికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన 2వ మ్యాచ్‌లో RCB జట్టు గెలిచినప్పటికీ, అల్జారీ జోసెఫ్ భారీగా పరుగులిచ్చాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన అల్జారీ 43 పరుగులిచ్చి 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు. అలాగే కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అల్జారీ జోసెఫ్ కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఈ 12 బంతుల్లో 34 పరుగులు వచ్చాయి. ఇలా మూడు మ్యాచ్‌ల్లో 9.4 ఓవర్లు వేసిన అల్జారీ జోసెఫ్ మొత్తం 115 పరుగులు ఇచ్చి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారంగా మారిపోయాడు. అందువల్ల తదుపరి మ్యాచ్‌లో ఆర్‌సిబి ఆడే ఎలెవన్‌లో విండీస్ పేసర్‌ను తప్పించే అవకాశం ఉంది.

RCB జట్టు తమ తదుపరి మ్యాచ్‌ని లక్నో సూపర్‌జెయింట్‌తో ఆడనుంది. ఏప్రిల్ 2న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తోంది ఆర్సీబీ.

ఇవి కూడా చదవండి

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు..

ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లొమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, మోహమ్ దీప్ , మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరణ్, లక్కీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

మూడు మ్యాచుల్లో ఒకే వికెట్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..