
Mumbai Indians vs Lucknow Super Giants: ఈ సీజన్ లో ఆఖరి మ్యాచ్ ఆడుతోన్న లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు అదరగొట్టారు. ముంబై బౌలర్లపై విరుచుకుపడుతూ ఫోర్ల, సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా నికోలస్ పూరన్ 29 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అలాగే కెప్టెన్ కేఎల్ రాహుల్ 41 బంతుల్లో 55 ( 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. పూరన్ , రాహుల్ ల జోరు చూస్తుంటే లక్నో స్కోరు 250 పరుగులు దాటుతుందని పించింది. కానీ వీరిద్దరూ ఔటైన తర్వాత లక్నో వరుసగా 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఆఖరి ఓవర్లలో ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్యా కొన్ని మెరుపు లు మెరిపించారు. దీంతో లక్నో స్కోరు 200 పరుగుల మార్కును చేరుకోగలిగింది.
ముంబై బౌలర్లలో నువాన్ తుషార, పీయూష్ చావ్లా చెరో 3 వికెట్లు పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్ లో స్థానం దక్కించుకున్న అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో నిరాశ పర్చాడు. 2.2 ఓవర్లలో 22 పరుగులు సమర్పించుకున్నాడు.
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రెవిస్, నెహాల్ వాద్రా, రొమారియో షెపర్డ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషారా.
రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI:
కేఎల్ రాహుల్ (కెప్టెన్ & వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్.
నవీన్-ఉల్-హక్, ఆష్టన్ టర్నర్, మణిమారన్ సిద్ధార్థ్, ప్రేరక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..