
ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2024 ప్రారంభానికి ముందే డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే టీమ్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ ప్రారంభమ్యాచ్ లకు అందుబాటులో ఉండడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టుకు మరో షాక్ తగిలింది. జట్టులో స్టార్ పేసర్ గా పేరొందిన దిల్షాన్ మధుశంక ఐపీఎల్ తొలి సగం మ్యాచ్ లకు అందుబాటులో ఉండడం లేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రీలంక లెఫ్టార్మ్ పేసర్ దిల్షాన్ మధుశంక గాయపడ్డాడు. దీంతో అతను స్వదేశానికి వెళ్లిపోయాడు. అలాగే కొంత సేపు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అందుకే అతను పూర్తిగా కోలుకుంటేనే ఐపీఎల్‌లో ఆడే అవకాశముంది. ఈసారి ఐపీఎల్ వేలంలో దిల్షాన్ మధుశంకను రూ.4.6 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అత్యుత్తమ యువ లెఫ్టార్మ్ పేసర్‌గా గుర్తింపు పొందిన మధుశంక.. జస్ప్రీత్ బుమ్రాకు మంచి సహకారం అందిస్తాడని ముంబై ఆశించింది. ఇప్పుడు దిల్షాన్ మధుశంక గాయపడడంతో ఆ జట్టుకు ఎదురుదెబ్బ తగిలిందని భావించవచ్చు.
మరోవైపు ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఓపెనింగ్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని సమాచారం. ప్రస్తుతం సూర్యకుమార్ ఎన్‌సీఏలో ఉన్నందున ముంబై ఇండియన్స్ జట్టు తొలి రెండు మ్యాచ్‌లకు సూర్య అందుబాటులో ఉండడని తెలుస్తోంది. మొత్తానికి హార్దిక్ పాండ్యా సారథ్యంలో కొత్త సీజన్ ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఇప్పుడు ఆటగాళ్ల గాయాల ఆందోళన కొత్త తలనొప్పిగా మారింది. మరి ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఎలా రాణిస్తుందో చూడాలి.
🚨 Team Updates 🚨
Dilshan Madushanka will not further take part in the ongoing tour as the bowler will return to start rehabilitation work after suffering an injury during the 2nd ODI.
Madushanka, who left the field during the second ODI while bowling, has suffered a left… pic.twitter.com/O3RvhR7oHa
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) March 17, 2024
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఎన్. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మాధ్వల్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, రొమారియో షెపర్డ్, రొమారియో షెపర్డ్. గెరాల్డ్ కోయెట్జీ, దిల్షన్ మధుశంక, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మహ్మద్ నబీ, శివాలిక్ శర్మ.
Train hard & smash the cake harder 😉🎂 ➡️ https://t.co/erlAgkAGxH
Check out the full version of #MIDaily on our website & MI App now! 💙#OneFamily #MumbaiIndians pic.twitter.com/aJZ9VM2Vep
— Mumbai Indians (@mipaltan) March 17, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..