ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏమంత బాగోలేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆ జట్టుపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీని తొలగించి హార్దిక్ పాండ్యాకు అప్పగించినప్పటి నుంచి ముంబై టీమ్‌పై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఇక గుజరాత్, హైదరాబాద్ లతో జరిగిన మ్యాచుల్లో ఓటమితో హార్దిక్ పాండ్యా దారుణంగా ట్రోల్ అయ్యాడు. మాజీ క్రికెటర్లు కూడా హార్దిక్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను బౌలింగ్‌కు దూరంగా ఉంచడం సరికాదంటున్నారు. ఇలా వరుస సంఘటనలతో అభిమానుల చేతిలో తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా, బౌలింగ్ కోచ్ లసిత్ మలింగలకు పడడం లేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత తనను హగ్ చేసుకోవడానికి వచ్చిన మలింగను హార్దిక్ పట్టించుకోకుండా పక్కకు తోసేస్తూ వెళ్లిపోయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. పాండ్యా తీరు నచ్చక మలింగ కూడా అతనికి దూరంగా వెళ్లిపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మరోసారి నెటిజన్లకు ఆయుధంగా మారాడు హార్దిక్. ‘నువ్వు మారావా బ్రో.. సీనియర్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకో’ అంటూ అభిమానులు, నెటిజన్లు ముంబై కెప్టెన్ కు చురకలు అంటిస్తున్నారు.
ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎప్పటిలాగే మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కరచాలనం చేసుకున్నారు. ఇదే సమంయలో హార్దిక్ పాండ్యాను హగ్ చేసుకోవడానికి వచ్చాడు లసిత్ మలింగ. అయితే హార్దిక్ అతనిని పక్కకు తోసేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.
Does Hardik Pandya kicked Lasith Malinga? His hands, face reaction same story.
Not a good way to treat legend like Lasith Malinga. #HardikPandya #SRHvMI pic.twitter.com/Yg5a5hNRTE— Satya Prakash (@Satya_Prakash08) March 28, 2024
గతంలో కూడా పాండ్యా, మలింగలకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో బ్యాటింగ్ కు సిద్ధమవుతూ హార్దిక్ ప్యాడ్స్ కట్టుకొని రెడీగా ఉన్నాడు. డగౌట్ లో అతని వెనుక ముంబై ఇండియన్స్ కోచ్ లు లసిత్ మలింగ, కీరన్ పొలార్డ్ కుర్చీలపై కూర్చొని ఉన్నారు. హార్దిక్ ను చూసి పొలార్డ్ లేస్తూ ఇక్కడ కూర్చోవాలంటాడు. కానీ పక్కనే ఉన్న మలింగ అతన్ని వారిస్తూ.. నేనే వెళ్లిపోతానంటూ హార్దిక్ కు ముఖం చాటేస్తూ వెళ్లిపోయాడు. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మలింగ, హార్దిక్ ల మధ్య ఏదో జరుగుతోందంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Malinga Ki Hardik Ki Gattiga Adho Aindhi
Ninna Hug Kuda
Mottom Something Fishy pic.twitter.com/ToAARNW68w— Kiran (@KIRANPSPK45) March 28, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..