IPL 2024: 8 మ్యాచ్‌లు..150కు పైగా స్ట్రైక్‌రేట్‌తో రన్స్.. ముంబైకు అండగా తెలుగోడు.. టీ20 ప్రపంచకప్‌ లో ప్లేస్‌!

|

Apr 23, 2024 | 8:13 AM

Mumbai Indians vs Rajasthan Royals: IPL 2024 టోర్నమెంట్‌లో లో భాగంగా 38వ మ్యాచ్‌ లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌ జట్లు తల పడ్డాయి. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. టాపార్డర్ బ్యాటర్లు రోహిత్‌శర్మ (6), ఇషాన్ కిషన్ ‌(0), సూర్యకుమార్ యాదవ్ (10) తీవ్రంగా నిరాశపరిచారు

IPL 2024: 8 మ్యాచ్‌లు..150కు పైగా స్ట్రైక్‌రేట్‌తో రన్స్.. ముంబైకు అండగా తెలుగోడు.. టీ20 ప్రపంచకప్‌ లో ప్లేస్‌!
Tilak Verma
Follow us on

Mumbai Indians vs Rajasthan Royals: IPL 2024 టోర్నమెంట్‌లో లో భాగంగా 38వ మ్యాచ్‌ లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌ జట్లు తల పడ్డాయి. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. టాపార్డర్ బ్యాటర్లు రోహిత్‌శర్మ (6), ఇషాన్ కిషన్ ‌(0), సూర్యకుమార్ యాదవ్ (10) తీవ్రంగా నిరాశపరిచారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (10) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అయితే మిడిలార్డర్‌లో తిలక్ వర్మ ముంబై జట్టుకు అండగా నిలిచాడు. జట్టు స్కోరు 20/3 వద్ద క్రీజులోకి వచ్చిన తిలక్ వికెట్ కాపాడుకుంటూనే ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు. మొత్తం 45 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 65 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్‌ 144.44. అంతేకాదు నేహాల్ వాద్రాతో కలిసి 99 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు తిలక్. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగలిగింది.

టీ20 కెరీర్‌లో తిలక్ వర్మకు ఇది 15వ అర్ధశతకం. ఒక సెంచరీ కూడా చేశాడు. ఓవరాల్ గా ఐపీఎల్ లో ఐదో అర్ధ సెంచరీ కాగా ప్రస్తుత సీజన్ లో రెండో వది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడిన తిలక్ వరుసగా 25,64,32, 6, 16 నాటౌట్, 31, 34 నాటౌట్, 65 ఇలా కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. మొత్తం 45.50 సగటు, 150 కు పైగా స్ట్రైక్ రేట్ తో 273 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ సీజన్ లో తిలక్ స్కోర్లు ఇవే..

కాగా ఐపీఎల్‌లో పిన్న వయసులో 1000 పరుగులు పూర్తి చేసిన మూడో ప్లేయర్ గా క తిలక్ వర్మ నిలిచాడు. రిషబ్ పంత్ 20 ఏళ్ల 218 రోజులు, యశస్వి జైస్వాల్ 21 ఏళ్ల 130 రోజులు, తిలక్ వర్మ 21 ఏళ్ల 166 రోజులు, పృథ్వీ షా 21 ఏళ్ల 169 రోజులు, సంజూ శాంసన్ 21 ఏళ్ల 183 రోజుల్లో 1000 పరుగులు పూర్తి చేశారు. ఐపీఎల్ లో అమోఘంగా రాణిస్తోన్న తిలక్ వర్మను త్వరలో జరిగే టీ 20 ప్రపంచ కప్ లో ఎంపిక చేయాలని అభిమానులు కోరుతున్నారు..

ప్రపంచ కప్ లో ప్లేస్ దక్కేనా?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..