AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 42 ఏళ్ల బ్యాటర్ లెక్కలన్నీ తిరగరాశాడు.. 9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌ హాంఫట్.. ఎవరంటే.?

ఈ ఐపీఎల్ సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోని టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ప్రత్యర్ధి జట్టు ఏదైనా నో వర్రీ.. ధోని గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తుంటే.. రీ-సౌండ్ మోత మోగాల్సిందే. ఈ 42 ఏళ్ల బ్యాటర్ మొత్తం 20 ఏళ్ల కెరీర్‌లో చేయని పనిని..

ఈ 42 ఏళ్ల బ్యాటర్ లెక్కలన్నీ తిరగరాశాడు.. 9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌ హాంఫట్.. ఎవరంటే.?
Csk
Ravi Kiran
|

Updated on: Apr 20, 2024 | 11:30 AM

Share

ఈ ఐపీఎల్ సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోని టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ప్రత్యర్ధి జట్టు ఏదైనా నో వర్రీ.. ధోని గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తుంటే.. రీ-సౌండ్ మోత మోగాల్సిందే. ఈ 42 ఏళ్ల బ్యాటర్ మొత్తం 20 ఏళ్ల కెరీర్‌లో చేయని పనిని.. కేవలం 9 బంతుల్లో చేసి చూపించాడు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని 9 బంతుల్లోనే 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 2 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. అతడి స్ట్రైక్‌రేట్ 311.11గా ఉంది.

18వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోని.. మొదటి బంతి నుంచి దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలి బంతికి సింగిల్ తీసిన ధోని.. రెండో బంతికి అద్భుతమైన ఫోర్ బాదాడు. అనంతరం మొహ్సిన్ ఖాన్ ఓవర్‌లో ఫైన్ లెగ్ మీదుగా సిక్స్ కొట్టాడు ధోని. ఆ తర్వాత వికెట్ కీపర్ మీదుగా స్కూప్ షాట్ ఆడి మరో సిక్స్ కొట్టిన ధోని.. ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాడు. 20వ ఓవర్‌లో ధోనీ తన దూకుడును మరింతగా పెంచాడు. యశ్ ఠాకూర్ వేసిన చివరి 4 బంతుల్లో ధోనీ 2 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. ధోని కొట్టిన సిక్సర్లలో ఒకటి అత్యధికంగా 101 మీటర్లు కొట్టడం గమనార్హం.

ఐపీఎల్ 2024లో ధోనిదే ఆధిపత్యం..

ఈ ఐపీఎల్‌లో ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన ధోని తన బ్యాట్‌తో 87 పరుగులు చేశాడు. ధోనీ స్ట్రైక్ రేట్ 255 కంటే ఎక్కువగా ఉంది. అతడి బ్యాట్‌తో 8 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. ఈ టోర్నమెంట్‌లో ధోని ఇప్పటిదాకా అవుట్ కాకపోవడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ధోని కేవలం 9 బంతులు ఆడి ఏబీ డివిలియర్స్ రికార్డు బద్దలకోట్టాడు. ఐపీఎల్‌లో వికెట్‌కీపర్‌గా 5 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక భారత ఆటగాడిగా ధోనీ నిలిచాడు. దీంతో పాటు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు మిస్టర్ కూల్. ఐపీఎల్‌లో ఏబీ డివిలియర్స్ 5162 పరుగులు చేయగా.. ధోని ఇప్పటివరకు ఆడిన 257 మ్యాచ్‌ల్లో 5169 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 5 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక వికెట్ కీపర్ ఏబీ డివిలియర్స్ కాగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి ధోని చేరాడు. కాగా, ఇప్పటిదాకా ఆడిన 7 మ్యాచ్‌ల్లో నాలుగింట నెగ్గి.. మూడింటిలో ఓడిపోయి 8 పాయింట్లతో కొనసాగుతోంది.

Follow Us
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్..
కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస..
కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస..