Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya: భార్య వల్లే ముంబై జట్టులోకి హార్దిక్.. వెలుగులోకి సరికొత్త విషయం.. ఏకిపారేస్తోన్న నెటిజన్స్..

Hardik Pandya Divorce Natasa Stankovic: హార్దిక్ పాండ్యా, నటాసా స్టాంకోవిచ్ విడాకుల గురించి ప్రతిరోజూ ఒక కొత్త న్యూస్ వస్తోంది. విడాకుల వార్తల మధ్య, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులో చేరడానికి సంబంధించిన మరో పెద్ద వార్త బయటకు వచ్చింది. నివేదికల ప్రకారం, హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును విడిచిపెట్టి ముంబై ఇండియన్స్‌లో చేరాడు. తద్వారా విడాకులకు బదులుగా తన భార్యకు భారీ మొత్తం ఇవ్వవచ్చు అని తెలుస్తోంది.

Hardik Pandya: భార్య వల్లే ముంబై జట్టులోకి హార్దిక్.. వెలుగులోకి సరికొత్త విషయం.. ఏకిపారేస్తోన్న నెటిజన్స్..
Hardik Pandya Family
Venkata Chari
|

Updated on: May 27, 2024 | 3:15 PM

Share

Hardik Pandya Divorce Natasa Stankovic: హార్దిక్ పాండ్యా, నటాసా స్టాంకోవిచ్ విడాకుల గురించి ప్రతిరోజూ ఒక కొత్త న్యూస్ వస్తోంది. విడాకుల వార్తల మధ్య, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులో చేరడానికి సంబంధించిన మరో పెద్ద వార్త బయటకు వచ్చింది. నివేదికల ప్రకారం, హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును విడిచిపెట్టి ముంబై ఇండియన్స్‌లో చేరాడు. తద్వారా విడాకులకు బదులుగా తన భార్యకు భారీ మొత్తం ఇవ్వవచ్చు అని తెలుస్తోంది. హార్దిక్, నటాషాల మధ్య విడాకులు తీసుకోవచ్చని చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఇరువైపుల నుంచి పెద్దగా ప్రకటన వెలువడలేదు. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో ఇప్పుడే చెప్పలేం. అయితే ప్రతిరోజు ఒక షాకింగ్ రివీల్ అవుతూనే ఉంది. హార్దిక్ పాండ్యా రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును ఛాంపియన్‌గా కూడా చేశాడు. అయితే, ఐపీఎల్ 2024కి ముందు, అతను ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. దీనిపై చాలా చర్చ జరిగింది.

నటాషా స్టాంకోవిచ్ కారణంగా ముంబై ఇండియన్స్‌లో చేరిన హార్దిక్ పాండ్యా..

అహ్మదాబాద్ మిర్రర్ నివేదిక ప్రకారం, భార్య నటాషాకు డబ్బు ఇవ్వడం వల్లనే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌తో విడిపోవాలని నిర్ణయించుకున్నాడు. భారీ మొత్తంలో తీసుకొని ముంబై ఇండియన్స్‌లో చేరాడు. అయితే ఈ రిపోర్టులో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

విడాకుల పుకార్ల మధ్య, సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాల్లో ఆస్తి పంపకం కీలకమైనదిగా మారింది. హార్దిక్, నటాషా విడాకులు తీసుకుంటే, హార్దిక్ పాండ్యా ఆస్తిలో 70 శాతం అతని భార్య పేరుకు బదిలీ చేయబడుతుంది. విడాకులు తీసుకుంటే హార్దిక్ ఆస్తిలో 70 శాతం నటాషా పేరు మీదకు బదలాయించబడుతుందని పలు సోషల్ మీడియా పోస్ట్‌లలో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఆస్తుల విలువ రూ.91 కోట్లు. అతనికి వడోదరలో 6000 చదరపు అడుగుల పెంట్‌హౌస్ ఉంది. దీని ధర దాదాపు రూ.3.6 కోట్లుగా చెబుతున్నారు. ఇది కాకుండా హార్దిక్ పాండ్యాకు ముంబైలోని బాంద్రాలో అపార్ట్‌మెంట్ కూడా ఉంది. ఈ ఎనిమిది గదుల అపార్ట్మెంట్ 3838 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని ధర దాదాపు రూ. 30 కోట్లు అని భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..