T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో దినేశ్ కార్తీక్‌! ఆ స్టార్ ఆటగాళ్ల స్థానాలకు ఎసరు

|

Apr 16, 2024 | 9:47 PM

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో దినేష్ కార్తీక్ గట్టిగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, T20 ప్రపంచ కప్ ఎంపిక గురించి రోహిత్ శర్మ కార్తీక్‌ను ఎగతాళి చేశాడు. ఈ విషయాన్ని కార్తీక్ సీరియస్‌గా తీసుకున్నట్లున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 83 పరుగులతో రెచ్చిపోయాడు

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో దినేశ్ కార్తీక్‌! ఆ స్టార్ ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
Dinesh Karthik
Follow us on

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో దినేష్ కార్తీక్ గట్టిగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, T20 ప్రపంచ కప్ ఎంపిక గురించి రోహిత్ శర్మ కార్తీక్‌ను ఎగతాళి చేశాడు. ఈ విషయాన్ని కార్తీక్ సీరియస్‌గా తీసుకున్నట్లున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 83 పరుగులతో రెచ్చిపోయాడు. ఈ ఇన్నింగ్స్ టీమిండియా అభిమానులను సంతోష పెట్టి ఉండవచ్చు. అదే సమయంలో T20 ప్రపంచ కప్ కోసం రేసులో ఉన్న కొంతమంది ఆటగాళ్లకు డేంజర్ బెల్స్ మోగినట్లే. ఎందుకంటే డీకే జట్టులోకి వస్తే ఇది వారి ఎంపికను ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్‌లో దినేష్ కార్తీక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వికెట్ కీపర్‌తో పాటు ఫినిషర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. IPL 2024లో అతని గణాంకాలను పరిశీలిస్తే, అతను ఫినిషర్ పాత్రలో భారత జట్టుకు అత్యంత సమర్థుడిగా కనిపిస్తున్నాడు. కార్తీక్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో 75 సగటుతో 226 పరుగులు చేశాడు. కాగా, అతని స్ట్రైక్ రేట్ (205) కూడా అద్భుతంగా ఉంది. డెత్ ఓవర్లలో కార్తీక్ ఆటతీరుతో రిషబ్ పంత్, సంజూ శాంసన్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, శివమ్ దూబే స్థానాలకు డేంజర్ బెల్స్ మోగినట్లేనని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టాప్ ఆర్డర్‌లో రిషబ్ పంత్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్, బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి నలుగురు బ్యాటర్లలో యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లు ఫిక్స్‌గా ఉన్నారు. మిడిలార్డర్‌లో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఆడగలరు. కార్తీక్ వికెట్ కీపింగ్‌తో పాటు ఆరో నంబర్ లేదా ఏడో నంబర్‌లో ఫినిషర్ పాత్రను కూడా పోషించగలడు. అయితే కార్తీక్ ప్రదర్శనతో రిషబ్ పంత్‌ స్థానానికి పెద్ద ముప్పేమి లేదంటున్నారు. ఎందుకంటే పంత్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇది కాకుండా, అతను ఇంతకు ముందు జట్టుకు ఫినిషర్ పాత్రను పోషించాడు. అలాగే వికెట్ కీపింగ్‌ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాడు. కార్తీక్ స్థానం కల్పిస్తే ఎటు తిరిగి రింకూ సింగ్, శివమ్ దూబేల స్థానాలకు ఎసరు పడినట్టే. పైగా వీరిద్దరికి ప్రపంచకప్ వంటి పెద్ద ఈవెంట్లలో ఆడిన అనుభవం లేదు.

 

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్/శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, యుజ్వేంద్ర చాహల్, రింకూ సింగ్, కుల్‌దీప్, బుమ్రా మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్.

రిజర్వ్‌లు:

రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..