ఐపీఎల్ ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రోహిత్ శర్మ వికెట్ పడిందని సంబరాలు చేసుకున్నందుకు కొందరు అభిమానులు ఒక వ్యక్తి తల పగలకొట్టారు. అతను గత రెండ్రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు వదిలాడు. మరణించిన వ్యక్తి కూడా చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమాని కావడం గమనార్హం. మహరాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆటను కేవలం వినోదంగా చూడాలని, ఇలా ఓ వ్యక్తిని కొట్టి చంపడం దారుణమంటూ క్రికెట్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మృతుడు బందుపంత్ బాపుసో తిబిలే , సాగర్ జాంగే, బల్వంత్ జాంగే లతో కలిసి బుధవారం (మార్చి 27) రాత్రి 10 గంటల సమయంలో IPL మ్యాచ్ (సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్) ని చూస్తున్నారు. హైదరాబాద్ ఇచ్చిన 277 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు అద్భుత శుభారంభం అందించారు. అయితే అతి తక్కువ వ్యవధిలోనే రెండు వికెట్లు పడ్డాయి.ముఖ్యంగా రోహిత్ శర్మ వికెట్ పతనం ముంబై ఇండియన్స్ శిబిరాన్ని షాక్ కు గురి చేసింది. రోహిత్ ఔట్ చూసి అభిమానులు కూడా షాక్ అయ్యారు. దీంతో సాగర్ జంజా, బల్వంత్ జంజా ఇద్దరూ నిరాశకు గురయ్యారు. కానీ అక్కడే కూర్చున్న సీఎస్‌కే అభిమాని బందుపంత్ టిబిలే రోహిత్ ఔట్‌తో సంబరాలు చేసుకున్నాడు. ఇది చూసిన సాగర్ జంజా, బల్వంత్ జంజాలకు కోపం వచ్చింది. వెంటనే వీరిద్దరూ బండుపంత్‌తో వాగ్వాదానికి దిగారు.
క్రమేపీ ఈ గొడవ ఒకరినొకరు కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే గొడవ తీవ్రరూపం దాల్చడంతో సాగర్, బల్వంత్ పక్కనే కర్రలు అందుకుని బండుపంత్ తలపై తీవ్రంగా కొట్టారు. దీంతో బండుపంత్ చెవులు, ముక్కు నుండి రక్తం కారడం ప్రారంభమైంది. తీవ్రంగా గాయపడిన బందుపంత్ టిబిలేను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక మూడు రోజుల తర్వాత అంటే ఆదివారం మృతి చెందాడు. టిబిల్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు, అల్లుడు, కొడుకు, మనుమలు, సోదరులు, సోదరీమణులు ఉన్నారు. నిందితులు సాగర్ జాంగే, బల్వంత్ జాంగేలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
Maharashtra: Man Beaten To Death For Celebrating Rohit Sharma’s Wicket In Kolhapur.
Balwant Jhanjge and his nephew Sagar Jhanjge allegedly assaulted Bandupanth Tibile with a wooden board and a stick, resulting in fatal injuries. https://t.co/a8e12a6d2c
— Crime Reports India (@AsianDigest) March 31, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..