
Royal Challengers Bengaluru vs Delhi Capitals Confirmed Playing XI in Telugu:ఐపీఎల్ 2024లో 62వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటేఈ హై ఓల్టేజ్ గేమ్ లో విజయం సాధించడం ఇరు జట్లకు చాలా కీలకం. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోతే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అయితే ఓటమి ఎదురైనా ఢిల్లీ మాత్రం ప్లే ఆఫ్ కు అవకాశముంటుంది. . ఢిల్లీ జట్టు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 30 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో బెంగళూరు 18 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ కు దిగనుంది.
ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్
స్వప్నిల్ సింగ్, అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయ్, వైషాక్ విజయ్‌కుమార్, హిమాన్షు
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), షాయ్ హోప్, కుమార్ కుషాగ్రా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
డేవిడ్ వార్నర్, సుమిత్ కుమార్, రికీ భుయ్, విక్కీ ఓస్ట్వాల్, ప్రవీణ్ దూబే
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..