Lucknow Super Giants vs Rajasthan Royals Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ సీజన్ 2024లో భాగంగా 44 వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి ఏక్నా క్రికెట్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో రాజస్థాన్ వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. మరోవైపు లక్నో పడుతూ లేస్తోంది. కే ఎల్ రాహుల్ సారథ్యంలోని ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. లక్నో కూడా తమ విజయ పరంపరను కొనసాగించాలని కోరుకుంటోంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి లక్నో మొదట బ్యాటింగ్ కు దిగనుంది.
🚨 Toss Update from Lucknow 🚨@rajasthanroyals win the toss & elect to bowl against @LucknowIPL
Follow the Match ▶️ https://t.co/Dkm7eJqwRj#TATAIPL | #LSGvRR pic.twitter.com/F09WUphJcQ
— IndianPremierLeague (@IPL) April 27, 2024
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
రియాన్ పరాగ్, శుభమ్ దూబే, నవదీప్ సైనీ, టామ్ కోహ్లర్-కాడ్మోర్, తనుష్ కోటియన్
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):
క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్ & వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్
అమిత్ మిశ్రా, అర్షిన్ కులకర్ణి, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్ చరక్, మణిమారన్ సిద్ధార్థ్
Ekana mein ek change: Riyan moves to the subs and Jos will start us off! 🔥#RoyalsFamily | @Dream11 pic.twitter.com/6PfsjY4i4G
— Rajasthan Royals (@rajasthanroyals) April 27, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..