Punjab Kings vs Chennai Super Kings: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా విజయం సాధించాల్సిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు తడబడ్డారు. పంజాబ్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఆ జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై… నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది. రవీంద్ర జడేజా (43) టాప్ స్కోరర్ గా నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ (32), డారిల్ మిచెల్ (30), మొయిన్ (17), శార్ధూల్ ఠాకూర్ (17) ఫర్వాలేదని పించారు. ఎంఎస్ ధోనీ (0), శివమ్ దుబే (0) డకౌట్లుగా వెనుదిరిగి ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్, రాహుల్ చాహర్ చెరో 3 వికెట్లు పడగొట్టగా అర్ష్‌దీప్ 2, సామ్ కరణ్ ఒక వికెట్ తీశారు. కాగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ విషయానికొస్తే ఇక్కడి నుంచి వచ్చే ప్రతి విజయం కీలకమే. దీంతో అన్ని జట్లూ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రెండు పాయింట్లతో నెట్ రన్ రేట్ బాగానే ఉంచుకోవాలి. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్ కూడా అంతే ముఖ్యమైనది. ఎందుకంటే ప్రస్తుతం రెండు జట్లు ప్లేఆఫ్ రేసులో లేవు. కాబట్టి టాప్ 4 ర్యాంక్ సాధించాలంటే ఇరు జట్లకు గెలుపు చాలా ముఖ్యం.
Deceived 🤯
ఇవి కూడా చదవండిReactions says it all as MS Dhoni departs to a brilliant slower one from Harshal Patel 👏
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvCSK | @PunjabKingsIPL pic.twitter.com/gYE5TqnqaY
— IndianPremierLeague (@IPL) May 5, 2024
పంజాబ్ కింగ్స్ (PBKS): జానీ బెయిర్‌స్టో, రిలీ రోసౌ, శశాంక్ సింగ్, సామ్ కర్రాన్(సి), జితేష్ శర్మ(w), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్‌లు:
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, తనయ్ త్యాగరాజన్, విధ్వత్ కవేరప్ప, రిషి ధావన్
చెన్నై సూపర్ కింగ్స్ (CSK): అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (సి), డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (w), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే.
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్:
సమీర్ రిజ్వీ, సిమర్జీత్ సింగ్, షేక్ రషీద్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి
Deposited 💥
Ravindra Jadeja getting some vital runs in pursuit of a strong finish 👊
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvCSK | @ChennaiIPL pic.twitter.com/7PCs74psi9
— IndianPremierLeague (@IPL) May 5, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..