IPL 2024: అఫీషియల్.. ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు.. ఆ రెండు మ్యాచ్‌ల తేదీల్లో మార్పు.. కారణమిదే
ఐపీఎల్ 15వ మ్యాచ్ మంగళవారం (ఏప్రిల్ 2) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ పై ఓ పెద్ద అప్‌డేట్ వచ్చింది. 17వ సీజన్ షెడ్యూల్ లో కొన్ని మార్పులు చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

ఐపీఎల్ 17వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది సోమవారం (ఏప్రిల్ 1వ తేదీ) వరకు మొత్తం 14 మ్యాచ్‌లు విజయవంతంగా జరిగాయి. ఈ 14 మ్యాచ్‌లలో రాజస్థాన్ రాయల్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా, ముంబై ఇండియన్స్ అత్యంత విఫలమైన జట్టుగా నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ విజయం సాధించింది. ముంబై హ్యాట్రిక్ పరాజయాలను పూర్తి చేసుకుంది. ఐపీఎల్ 15వ మ్యాచ్ మంగళవారం (ఏప్రిల్ 2) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ పై ఓ పెద్ద అప్‌డేట్ వచ్చింది. 17వ సీజన్ షెడ్యూల్ లో కొన్ని మార్పులు చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 2 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ మార్చింది. కోల్‌కతా vs రాజస్థాన్ మధ్య మ్యాచ్ ఏప్రిల్ 17న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సి ఉంది. మారిన షెడ్యూల్ ప్రకారం, ఇప్పుడు మ్యాచ్ ఒక రోజు ముందుగా ఏప్రిల్ 16న జరగనుంది. ఏప్రిల్ 17న నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ vs ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ ఏప్రిల్ 16న జరగనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
కారణమిదే
ఇదిలా ఉంటే ఏప్రిల్ 17న శ్రీరామ నవమి. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కోల్ కతాలో మరింత అట్టహాసంగా వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు పోలీసులు భద్రత కల్పిస్తారా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల వాతావరణం ఉంటుంది. దీంతో మ్యాచ్‌ను వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలకు, బ్రాడ్ కాస్టర్లకు సమాచారం అందించింది.
🚨 NEWS 🚨
KKR-RR, GT-DC games rescheduled.
Details 🔽 #TATAIPL https://t.co/O56PJaKKv4
— IndianPremierLeague (@IPL) April 2, 2024
With fresh memories of last year’s intense #RCBvLSG game, @RCBTweets Head Coach Andy Flower is on the other side, up against familiar faces 😎
As the two sides face each other tonight, Andy Flower tells us what’s in store 👌👌 – By @RajalArora #TATAIPL pic.twitter.com/O7OBHZ3b12
— IndianPremierLeague (@IPL) April 2, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..