IPL 2024 Auction: ఐపీఎల్ వేలానికి మొదలైన కౌంట్‌డౌన్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలంటే?

|

Dec 18, 2023 | 10:52 AM

IPL 2024 Auction Live Streaming Details: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకా కోలా అరేనాలో జరగనుంది. మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో కనిపించనున్నారు. ఐపీఎల్ యాక్షన్ 2024 ఏ సమయంలో ప్రారంభమవుతుంది?, ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి? ఇలా అనేక విషయానలు ఇప్పుడు తెలుసుకుందాం..

IPL 2024 Auction: ఐపీఎల్ వేలానికి మొదలైన కౌంట్‌డౌన్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలంటే?
Ipl 2024 Auction
Follow us on

IPL 2024 Auction: ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలం (IPL 2024 Auction)కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇక మిగిలింది ఒక్కరోజు మాత్రమే. భారత, విదేశీ ఆటగాళ్లతో కలిపి మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో కనిపించనున్నారు. ఇందులో భారత్ నుంచి 214 మంది, విదేశాల నుంచి 119 మంది క్రీడాకారులు పాల్గొంటారు. IPL 2024 సీజన్‌లో జరగబోయేది ‘మినీ వేలం’.. ఎందుకంటే మెగా వేలం 2025 సీజన్‌లో నిర్వహించనున్నారు. ఇది మినీ వేలం అయినప్పటికీ సర్వత్రా ఆసక్తి నెలకొంది. రూ.20 కోట్ల వరకు బిడ్ ఉంటుందని చెబుతున్నారు. ఐపీఎల్ యాక్షన్ 2024 ఏ సమయంలో ప్రారంభమవుతుంది?, ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి? ఇలా అనేక విషయానలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలం ఎప్పుడు?

2024 ఐపీఎల్ వేలం డిసెంబర్ 19న జరగనుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలం ఎక్కడ నిర్వహించనున్నారు?

2024 ఐపీఎల్ వేలం దుబాయ్‌లోని కోకా కోలా ఎరీనాలో జరగనుంది.

డిసెంబర్ 19న IPL 2024 వేలం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

IPL 2024 వేలం దుబాయ్ కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటలకు (దుబాయ్), అంటే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది.

IPL 2024 వేలాన్ని ఏ ఛానెల్‌లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి?

స్టార్ట్ స్పోర్ట్స్ అనేది IPL 2024 వేలం అధికారిక ప్రసారకర్త. స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్‌డి, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డి, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డి హిందీ, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ్, స్టార్ స్పోర్ట్స్ 1 HD తమిళం, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 1 HD తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ ఇలా రీజినల్ లాంగ్వేజస్‌లోనూ చూడొచ్చు.

IPL 2024 వేలం ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?

యాప్‌లు, వెబ్‌సైట్‌లో JioCinemaలో IPL 2024 వేలం ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.

దుబాయ్‌లో జరిగే ఐపీఎల్ వేలంలో ఎంత మంది క్రికెటర్లు పాల్గొటారు?

రేపు జరగనున్న ఐపీఎల్ వేలంలో మొత్తం 333 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఏ జట్టు దగ్గర ఎంత డబ్బు ఉంది?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): రూ. 23.25 కోట్లు.

చెన్నై సూపర్ కింగ్స్ (CSK): రూ. 31.4 కోట్లు.

ముంబై ఇండియన్స్ (MI): రూ. 17.25 కోట్లు.

గుజరాత్ టైటాన్స్ (GT): రూ. 38.15 కోట్లు.

లక్నో సూపర్ జెయింట్స్ (LSG): రూ. 13.15 కోట్లు.

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): రూ. 32.7 కోట్లు.

రాజస్థాన్ రాయల్స్ (RR): రూ. 14.5 కోట్లు.

ఢిల్లీ క్యాపిటల్స్ (DC): రూ. 28.9 కోట్లు.

పంజాబ్ కింగ్స్ (PBKS): రూ. 29.1 కోట్లు.

సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH): రూ. 34 కోట్లు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..