IPL 2024 Auction: 77 స్థానాలు..1,166 మంది ప్లేయర్లు.. ఒక్కో టీమ్‌ ఎంత మందిని తీసుకోవచ్చంటే? పూర్తి వివరాలు

పీఎల్ నిబంధనల ప్రకారం, ఒక జట్టులో కనీసం 18 మంది, గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. అయితే ఇక్కడ జట్టులో 25 మంది ఆటగాళ్లు ఉండాలనే నిబంధన లేదు. కొన్ని జట్లు తమ పర్స్ ప్రకారం ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయి. దీని ప్రకారం ఐపీఎల్‌ 17వ సీజన్‌లో 10 జట్లలో ఒక్కో టీమ్‌ ఎంత మంది ఆటగాళ్లను తీసుకోవచ్చో తెలుసుకుందాం రండి.

IPL 2024 Auction: 77 స్థానాలు..1,166 మంది ప్లేయర్లు.. ఒక్కో టీమ్‌ ఎంత మందిని తీసుకోవచ్చంటే? పూర్తి వివరాలు
లిస్టులో ఉన్న మరో ప్లేయర్.. రచిన్ రవీంద్ర. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌తో వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించాడు. మెగాటోర్నీలో 578 పరుగులు సాధించి.. ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. ఆల్‌రౌండర్ కోసం వెతుకుతున్న ఫ్రాంచైజీలు ఇతడిపై కాసుల వర్షం కురిపించడం ఖాయం.

Updated on: Dec 07, 2023 | 5:48 PM

IPL సీజన్ 17 మినీ వేలానికి కౌంట్‌ డౌన్‌ మొదలైంది. డిసెంబర్ 19న జరగనున్న వేలం ప్రక్రియ కోసం మొత్తం 1166 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం 10 జట్లలో మొత్తం ఖాళీల సంఖ్య 77 మాత్రమే. అయితే ఇక్కడ ప్రతి జట్టు పర్స్ మొత్తాన్ని బట్టి ఆటగాళ్లకు అవకాశం లభిస్తుంది. అంటే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం, ఒక జట్టులో కనీసం 18 మంది, గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. అయితే ఇక్కడ జట్టులో 25 మంది ఆటగాళ్లు ఉండాలనే నిబంధన లేదు. కొన్ని జట్లు తమ పర్స్ ప్రకారం ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయి. దీని ప్రకారం ఐపీఎల్‌ 17వ సీజన్‌లో 10 జట్లలో ఒక్కో టీమ్‌ ఎంత మంది ఆటగాళ్లను తీసుకోవచ్చో తెలుసుకుందాం రండి.

1- గుజరాత్ టైటాన్స్ (GT): ఈ మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ మొత్తం 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఆరుగురు భారత ప్లేయర్లు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.
2. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): SRH జట్టులో అందుబాటులో ఉన్న మొత్తం స్లాట్‌లు 6. అంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ముగ్గురు భారత ఆటగాళ్లు, ముగ్గురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
3. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఖాళీగా ఉన్న స్లాట్ల సంఖ్య 12. అంటే ఎనిమిది మంది భారత క్రికెటర్లు, నలుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు.
4.  చెన్నై సూపర్ కింగ్స్ (CSK): CSK జట్టు ఈసారి 6 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. వీరిలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు, ముగ్గురు భారత ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

5- పంజాబ్ కింగ్స్ (PBKS): పంజాబ్ జట్టులో 8 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఆరుగురు స్వదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

6- ఢిల్లీ క్యాపిటల్స్ (DC): ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి 9 స్లాట్‌లు ఉన్నాయి. నలుగురు విదేశీ ఆటగాళ్లు , ఐదుగురు భారత ఆటగాళ్లను తీసుకోవడానికి ఛాన్స్‌ ఉంది.

7- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): RCB జట్టు ఈసారి మొత్తం 6 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. వీరిలో 3 విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. అలాగే 3 భారత ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

8- ముంబై ఇండియన్స్ (MI): రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ మొత్తం 8 స్లాట్‌లను కలిగి ఉంది. నలుగురు విదేశీ ఆటగాళ్లు, నలుగురు భారతీయ ఆటగాళ్లును తీసుకోవచ్చు.

9- రాజస్థాన్ రాయల్స్ (RR): RR జట్టులో ఖాళీగా ఉన్న 8 స్లాట్‌లలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. అలాగే 5 మంది భారతీయ ఆటగాళ్లను అనుమతించవచ్చు.

10- లక్నో సూపర్ జెయింట్స్ (LSG): లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. ఈ స్థానాల్లో నలుగురు భారత ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. ఈ వేలం కోసం మొత్తం 1166 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ ఆటగాళ్ల జాబితా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆటగాళ్ల వేలం జాబితాను ఫైనల్‌ చేస్తారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..