ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ హవా కొనసాగుతోంది. తాజాగా ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ను 20 పరుగుల తేడాతో ఓడించింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ను ఒక విషయం బాగా కలవరపెడుతోంది. అదే వరల్డ్ కప్ హీరో, న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ ఫామ్. డ్యాషింగ్ బ్యాటర్ గా పేరున్నడారిల్ ముంబై తో మ్యాచ్ లో 14 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక బౌండరీ కూడా ఉంది. అంతకు ముందు మ్యాచుల్లోనూ మిచెల్ పెద్దగా ఆడింది లేదు. ఈ సీజన్ లో ఆడిన ఆరు మ్యాచుల్లో వరుసగా 22, 24 నాటౌట్, 34, 13, 25, 17 పరుగులు చేశాడు. అంటే ఇప్పటివరకు మొత్తం 6 మ్యాచుల్లో 135 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. స్ట్రైక్ రేట్ కూడా 125.00 మాత్రమే.
ఐపీఎల్ సీజన్ కు ముందు జరిగిన మినీ వేలంలో డారిల్ మిచెల్ ను ఏకంగా రూ. 14 కోట్లు ధార పోసి మరీ కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. అయితే అతని ధరకు, ఆటతీరుకు పొంతన ఉండడం లేదంటూ సీఎస్కే అభిమానులు మిచెల్ పై విమర్శలు కురిపిస్తున్నారు. . పరుగులు చేయకపోగా.. ధాటిగా ఆడటంలో కూడా విఫలమవుతున్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు. అతని స్థానంలో మరో భారత ప్లేయర్ కు అవకాశమివ్వాలని సూచిస్తున్నారు. అదే సమయంలో హై ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి మిచెల్ పై ఉందని ,అందుకే అతను పరుగులు చేయలేకపోతున్నాడంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. రాబోయే రోజుల్లో మంచి ఇన్నింగ్స్ లు ఆడతాడంటూ మిచెల్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
Daryl Mitchell in IPL 2024
22(18) Vs RCB
24(20) Vs GT
34(26) Vs DC
13(11) Vs SRH
25(19) Vs KKR
17(14) Vs MI-135(108)
Strike rate – 125
— Dr. DON ஸ்டைல் பாண்டி (@i_StylePaandi) April 15, 2024
We can promote @MitchellSantner to the top order in place of Daryl Mitchell in order to hit the strike and rotate. and he can serve as a spinner for us. – ALLROUNDER@ChennaiIPL #MIvsCSK #WhistlePodu, @StarSportsTamil #GoatFirstSingle #ChennaiSuperKings #DHONI𓃵 @RJ_Balaji pic.twitter.com/trB8kmtJRI
— Karthick sundaravadivelu (@karthickss21) April 15, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..