IPL 2023: అతనొచ్చాడని జట్టు సుడి తిరుగుతుందన్నారు.. కట్ చేస్తే.. రూ. 13 కోట్లకు పంగనామాలు పెడుతున్నాడు!
ఐపీఎల్ 2023లో హైదరాబాద్ జట్టు మళ్లీ పేలవ ప్రదర్శనే కొనసాగిస్తోంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఐదింట్లో ఓడిపోయి.. కేవలం 3 విజయాలు మాత్రమే అందుకుని పాయింట్ల పట్టికలో అడుగున ఉంది.
ఐపీఎల్ 2023లో హైదరాబాద్ జట్టు మళ్లీ పేలవ ప్రదర్శనే కొనసాగిస్తోంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఐదింట్లో ఓడిపోయి.. కేవలం 3 విజయాలు మాత్రమే అందుకుని పాయింట్ల పట్టికలో అడుగున ఉంది. ఆ జట్టు రూ. 13.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ ఆటతీరు కూడా సోసోగానే ఉంది. ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో ఏడింట విఫలమయ్యాడు. ఇక హోం గ్రౌండ్‌లో అయితే 4 ఇన్నింగ్స్‌ల్లోనూ పెద్దగా పరుగులేవి సాధించలేదు. చివరి రెండు ఇన్నింగ్స్‌లలో, అతడికి 10 పరుగులు చేయడం కూడా కష్టంగా మారింది. అయితేనేం ఇంత జరిగినా కూడా కోల్‌కతా నైట్ రైడర్స్ ఆ ఆటగాడిని చూసి భయపడుతోంది. మరి అతడెవరో కాదు హ్యారీ బ్రూక్ .
పాకిస్తాన్ పిచ్‌లపై తన ప్రతాపాన్ని చూపించి.. ఐపీఎల్ మినీ వేలంలో హాట్ టాపిక్‌గా నిలిచాడు హ్యారీ బ్రూక్. సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ. 13.25 కోట్ల భారీ మొత్తంతో కొనుగోలు చేసింది. ఈ బ్యాటర్ రాకతో తమ జట్టు సుడి తిరుగుతుందని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో ఒక్కదానిలో మాత్రమే, హ్యారీ బ్రూక్ తన ధరకు తగ్గట్టుగా ఆడాడని చెప్పొచ్చు.
KKRపై బ్రూక్ తొలి IPL సెంచరీ..
ఏప్రిల్ 14న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ IPLలో తన మొదటి సెంచరీని సాధించాడు. అతడు కేవలం 55 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో హైదరాబాద్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక ఆ మ్యాచ్ తర్వాత.. ఈ రెండు జట్లు గురువారం హైదరాబాద్ వేదికగా రెండోసారి తలబడుతున్నాయి. అయితే హ్యారీ బ్రూక్ ఇప్పటివరకు హోం గ్రౌండ్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 42 పరుగులే మాత్రమే చేశాడు. అతడి అత్యుత్తమ స్కోరు 13 పరుగులే కావడం గమనార్హం. కానీ ఈసారి హైదరాబాద్‌లో కేకేఆర్‌తో మ్యాచ్ కావడంతో మరోసారి బ్రూక్ తిరిగి ఫామ్ సాధిస్తాడని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం భావిస్తోంది. చూడాలి.! ఈ మ్యాచ్‌తోనైనా హ్యారీ బ్రూక్ తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాడో..? లేదో.?
??? ? ??????, ????? ?♂?
Ladies & Gentlemen, the first ? of #IPL2023 ??#KKRvSRH #HarryBrook #IPLonJioCinema #TATAIPL | @SunRisers pic.twitter.com/4nXzSi4ilV
— JioCinema (@JioCinema) April 14, 2023