IPL 2023: గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఫలితంగా పంజాబ్ కింగ్స్ ఖాతాలో మరో ఓటమి చేరింది. అయితే మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. టీమ్ బ్యాటింగ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ టీమ్ ఈ మ్యాచ్‌లో ఏకంగా 56 డాట్ బంతులకు డాట్‌గా వదిలేసిందని, అలా చేయడమే తమ ఓటిమికి కారణమని చెప్పుకొచ్చాడు. అయితే పంజాబ్ టీమ్‌లోని బౌలర్లు చివరి వరకు కూడా అసాధారణ ప్రదర్శన కనబర్చి మ్యాచ్‌ను గెలిపించే ప్రయత్నం చేశారని వారిపై ప్రశంసల జల్లు కురిపించాడు.
‘ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచలేకపోయాం. టీ20 ఇన్నింగ్స్‌లో ఏకంగా 56 బంతులు డాట్ బంతులో ఆడితే.. ఏ టీమ్ మాత్రం గెలుస్తుంది..? బ్యాటింగ్‌లో మా వైఫల్యమే ఓటమికి కారణం. బౌలర్లు చివరి వరకు కూడా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడిచేసేందుకు ఎంతగానో శ్రమించారు. అసాధారణ బౌలింగ్‌తో మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చార’నిని శిఖర్ ధావన్ అన్నాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్ తొలుత బ్యాటింగ్ చేసి.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఈ క్రమంలో పంజాబ్ తరఫున ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్(0), ధావన్(8) రాణించలేకపోయిన ఆ తర్వాత వచ్చిన మాథ్యూ షార్ట్(36), భానుక రాజపక్స(20), జితేష్ శర్మ(25), సామ్ కర్రన్(22), షారుఖ్ ఖాన్(22) నిలకడగా రాణించడంతో పంజాబ్ స్కోర్ 153 పరుగులకు చేరింది. ఇక గుజరాత్ తరఫున మోహిత్ శర్మ 2 వికెట్లతో రాణించగా.. మహ్మద్ షమి, జోషువా లిటిల్, అల్జారీ జోసెఫ్, రషిద్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.
అనంతరం క్రీజులోకి వచ్చిన గుజరాత్ టీమ్ 19.5 ఓవర్లలో అంటే ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. గుజరాత్ తరఫున శుభ్‌మన్ గిల్(67) హాఫ్ సెంచరీతో రాణించగా.. వృద్దిమాన్ సాహా(30), సాయి సుదర్శన్(19), డేవిడ్ మిల్లర్(17 నాటౌట్) తమ వంతు పాత్ర పోషించడంతో విజయం వారి సొంతమైంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..