Team India: మరోసారి విజృంభించిన టీమిండియా ఫినిషర్.. 6 సిక్సర్లతో 38 బంతుల్లో ఊచకోత!

ఈ మధ్యకాలంలో ఫుల్‌టైం కామెంటేటర్‌గా.. పార్ట్‌టైం ప్లేయర్‌గా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు టీమిండియా బ్యాటర్ దినేష్ కార్తీక్..

Team India: మరోసారి విజృంభించిన టీమిండియా ఫినిషర్.. 6 సిక్సర్లతో 38 బంతుల్లో ఊచకోత!
Ipl 2023

Updated on: Feb 22, 2023 | 5:41 PM

ఈ మధ్యకాలంలో ఫుల్‌టైం కామెంటేటర్‌గా.. పార్ట్‌టైం ప్లేయర్‌గా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు టీమిండియా బ్యాటర్ దినేష్ కార్తీక్. తాజాగా జరిగిన డివై పాటిల్ టోర్నీలో అతడు మరోసారి తాను బెస్ట్ ఫినిషర్ అని నిరూపించుకున్నాడు దినేష్ కార్తీక్. 6 సిక్సర్లతో 38 బంతుల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి.. ఫ్యాన్స్‌ను అలరించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ 38 బంతుల్లో 6 సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయంగా 75 పరుగులు చేశాడు. సీన్ కట్ చేస్తే.. కార్తీక్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది.

ఇదిలా ఉంటే.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో దినేష్ కార్తీక్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు టెస్టు మ్యాచ్‌లలో, కార్తీక్ వ్యాఖ్యాతగా అందరినీ అలరించాడు. ఇక మూడో టెస్టుకు కాస్త గ్యాప్ ఉండటంతో.. మళ్లీ బ్యాట్ పట్టి మైదానంలోకి దిగాడు. ఇక DY పాటిల్ టోర్నమెంట్‌లో దినేష్ కార్తీక్ పరుగులు వరద పారించడం.. RCBకి శుభసూచికం అని చెప్పొచ్చు. ఆ జట్టు బ్యాటర్లు కోహ్లి, డుప్లెసిస్, దినేష్ కార్తిక్, ఫైనల్‌గా మ్యాక్సీ కూడా ఫామ్‌లోకి తిరిగి వస్తే.. ఈ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తిరుగుండదు. కాగా, గతంలో ఐపీఎల్ 2022లో అద్భుత ప్రదర్శన చేసిన దినేష్ కార్తీక్‌.. ఆ తర్వాత టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. ఫినిషర్‌గా T20 ప్రపంచ కప్‌లో ఆడిన అతడు.. ఆ టోర్నమెంట్‌లో పెద్దగా రాణించకలేకపోవడంతో.. అనంతరం కార్తీక్‌ను జట్టు నుంచి తప్పించారు సెలెక్టర్లు.