IPL 2023: వికెట్ల రేసులో రషిద్ ఖాన్ దూకుడు.. హైదరాబాదీ బౌలర్ నుంచి చేజారిన క్యాప్..

| Edited By: Ravi Kiran

Apr 27, 2023 | 9:29 AM

IPL 2023, Purple Cap: ఐపీఎల్ 16వ సీజన్ వాడివేడిగా కొనసాగుతోంది. మ్యాచ్‌లో ప్రత్యర్థుల మధ్యనే కాక బ్యాటర్లు, బౌలర్లు కూడా నువ్వానేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇక ఐపీఎల్‌లో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి పర్పుల్ క్యాప్, అత్యధిక పరుగులు..

IPL 2023: వికెట్ల రేసులో రషిద్ ఖాన్ దూకుడు.. హైదరాబాదీ బౌలర్ నుంచి చేజారిన క్యాప్..
4. రషీద్ ఖాన్ (14 వికెట్లు): ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు ఈ ఐపీఎల్ సీజన్ చాలా బాగుంది. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన రషీద్ 32 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇందులో అతను 20 సగటుతో మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు.
Follow us on

IPL 2023, Purple Cap: ఐపీఎల్ 16వ సీజన్ వాడివేడిగా కొనసాగుతోంది. మ్యాచ్‌లో ప్రత్యర్థుల మధ్యనే కాక బ్యాటర్లు, బౌలర్లు కూడా నువ్వానేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇక ఐపీఎల్‌లో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి పర్పుల్ క్యాప్, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ దగ్గర ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నప్పటికీ.. అదే టీమ్‌కి చెందిన బౌలర్ చేతి నుంచి పర్పుల్ క్యాప్ చేజారింది. మంగళవారం రాత్రి గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగిన మ్యాచ్‌లో.. రషిద్ ఖాన్ 2 వికెట్లు తీయడం ద్వారా మహ్మద్ సిరాజ్ దగ్గర నుంచి పర్పుల్ క్యాప్ తీసుకున్నాడు. తద్వారా హైదరాబాద్‌కి చెందిన సిరాజ్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో ఆటగాడిగా పర్పుల్ క్యాప్ రేసులో 2వ స్థానంలో ఉన్నాడు.

గుజరాత్ గుజరాత్-ముంబై ఇండియన్స్ ఆటకు మందు పర్పుల్ క్యాప్‌తో సిరాజ్

కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ తరఫున 7 మ్యాచ్‌లు ఆడిన రషిద్ ఖాన్ మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతను 8.07 ఎకనామీతో మొత్తం 28 ఓవర్లు వేశాడు. అలాగే ఆర్‌సీబీ తరఫున మహ్మద్ సిరాజ్ కూడా 7 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు తీసుకున్నాడు. అయితే రషిద్ కంటే మెరుగ్గా 7.14 ఎకనామీతో 28 ఓవర్లు బౌలింగ్ చేశాడు సిరాజ్. ఇక పర్పుల్ క్యాప్ రేసులో సిరాజ్ తర్వాత ఆర్ష్‌దీప్ సింగ్(13, పంజాబ్ కింగ్స్), యుజ్వేంద్ర చాహల్(12, రాజస్థాన్ రాయల్స్), తుషార్ దేశ్‌పాండే(12, చెన్నై సూపర్ కింగ్స్) వరుస స్థానాల్లో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో ముంబై  ఇండియన్స్‌పై 55 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది ఈ క్రమంలో గుజరాత్ తరఫున శుభ్‌మన్ గిల్(56), డేవిడ్ మిల్లర్(46), అభినవ్ మనోహర్(42) మెరుగ్గా రాణించారు. ముంబై తరఫున పియూష్ చావ్లా 2, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండూల్కర్, జేసన్ బెహ్రండర్ఫ్, రిలే మెరిడిత్ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం 208 భారీ లక్ష్యంలో క్రీజులోకి వచ్చిన ముంబై బ్యాటర్లు తొలి నుంచే తడబడుతూ 9 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేయగలిగారు.  ఈ క్రమంలో ముంబై తరఫున నెహల్ వథేరా(40), కామెరూన్ గ్రీన్(33) మాత్రమే మెరుగ్గా రాణించారు. ఇక గుజరాత్ తరఫున నూర్ అహ్మద్ 3 వికెట్లను పడగొట్టగా.. మోహిత్ శర్మ, రషిద్ ఖాన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. అలాగే గుజరాత్ కెప్టెన్ హర్దిక్ కూడా ఒక వికెట్ పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..