Gujarat Titans vs Mumbai Indians, Qualifier 2: అద్భుతమైన ప్రదర్శనతో గుజరాత్‌ ఫైనల్‌కు.. క్వాలిఫయర్‌-2లో విజయం

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ మరోసారి అదిరిపోయే ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముంబయితో జరిగిన క్వాలిఫయర్‌-2లో 62 పరుగుల తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. హార్దిక్‌ పాండ్యా నాయకత్వంలో గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ టోర్నీలో వరుసగా..

Gujarat Titans vs Mumbai Indians, Qualifier 2: అద్భుతమైన ప్రదర్శనతో గుజరాత్‌ ఫైనల్‌కు.. క్వాలిఫయర్‌-2లో విజయం
Ipl 2023 Qualifier 2

Updated on: May 27, 2023 | 3:59 AM

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ మరోసారి అదిరిపోయే ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముంబయితో జరిగిన క్వాలిఫయర్‌-2లో 62 పరుగుల తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. హార్దిక్‌ పాండ్యా నాయకత్వంలో గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ టోర్నీలో వరుసగా రెండోసారి ఫైనల్‌ చేరింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌–2లో గుజరాత్‌ 62 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శుబ్‌మన్‌ గిల్‌ (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) శతకంతో కదం తొక్కాడు.

గిల్, సాయి సుదర్శన్‌ (31 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌కు 64 బంతుల్లోనే 138 పరుగులు జోడించారు. అనంతరం ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్‌ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, తిలక్‌ వర్మ (14 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. గుజరాత్‌ బౌలర్‌ మోహిత్‌ శర్మ 14 బంతుల్లో కేవలం 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి