పాయింట్ల పట్టికలో రివ్వున దూసుకొచ్చిన కోల్‌కతా.. బెంగళూరుకు డబుల్ ఝలక్.. ఏయే జట్లు, ఏయే స్థానాల్లో ఉన్నాయంటే?
పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్ కొనసాగుతోంది. అదే సమయంలో కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడిన ఆర్సీబీ జట్టు 7వ స్థానానికి పడిపోయింది. RCB ఖాతాలో కూడా 2 పాయింట్లు ఉన్నాయి. అయితే KKR చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో రన్ రేట్ దారుణంగా పడిపోయింది.
ఐపీఎల్ 2023లో భాగంగా 9వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి బోణి కొట్టింది.ఈడెన్ గార్డెన్ మైదానం వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో నితీష్ రాణా సారథ్యంలోని కేకేఆర్ 81 పరుగుల తేడాతో ఆర్‌సీబీని చిత్తుగా ఓడించింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌కి ఇదే తొలి విజయం. రాణా టీం మొదటి మ్యాచ్‌లో ఓడిపోగా, రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో కేకేఆర్ జట్టు 2లో ఒక ఓటమి, ఒక విజయంతో 2 పాయింట్లతో నేరుగా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. RCBపై భారీ విజయం సాధించడంతో కోల్‌కతా రన్ రేట్ కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం KKR రన్ రేట్ 2.056. ఇక పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్ కొనసాగుతోంది. అదే సమయంలో కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడిన ఆర్సీబీ జట్టు 7వ స్థానానికి పడిపోయింది. RCB ఖాతాలో కూడా 2 పాయింట్లు ఉన్నాయి. అయితే KKR చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో రన్ రేట్ దారుణంగా పడిపోయింది. ఈ కారణంగా 2 పాయింట్లు ఉన్నప్పటికీ, అది 7వ స్థానానికి పడిపోయింది. మొదటి మ్యాచ్ విజయం తర్వాత బెంగళూరు రన్‌రేట్1.981 కాగా ఈ మ్యాచ్ తర్వాత అది కాస్తా -1.256కి పడిపోయింది. ఆర్‌సీబీ కంటే ముందు నాలుగో స్థానంలో రాజస్థాన్ రాయల్స్, 5వ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్, ఆరో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఉన్నాయి.
కాగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు జట్లూ తొలి విజయంపై కన్నేశాయి. ఢిల్లీ 8, ముంబై 9, హైదరాబాద్ చివరి స్థానంలో ఉన్నాయి. ఇక KKR వర్సెస్ RCB మ్యాచ్ విషయానికొస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ 29 బంతుల్లో 68 పరుగులు చేశాడు. రహ్మానుల్లా గుర్బాజ్ 57 పరుగులు చేయగా, రింకూ సింగ్ 46 పరుగులు చేశారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన RCB జట్టు 123 పరుగులకే కుప్పకూలింది. వరుణ్ చక్రవర్తి 15 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. సుయాష్ శర్మ 30 పరుగులిచ్చి 3 వికెట్లు నేలకూల్చాడు.
IPL 2023 Points Table. pic.twitter.com/O9zDfDBGEo
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..