IPL 2023: అగ్రస్థానంపై కన్నేసిన దిగ్గజ టీంలు.. ఒక్కో మ్యాచ్‌తో మారుతోన్న రాతలు.. టాప్ ప్లేస్‌లో ఎవరంటే?

|

Apr 21, 2023 | 4:21 PM

IPL 2023 Points Table: ఐపీఎల్ సీజన్ 16లో రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. ఇప్పటికే చాలా జట్లు 6 మ్యాచ్‌లు ఆడాయి. 28వ మ్యాచ్ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్‌పై విజయంతో ఆర్‌సీబీ జట్టు పాయింట్ల పట్టికలో 2 స్థానాలు ఎగబాకింది.

IPL 2023: అగ్రస్థానంపై కన్నేసిన దిగ్గజ టీంలు.. ఒక్కో మ్యాచ్‌తో మారుతోన్న రాతలు.. టాప్ ప్లేస్‌లో ఎవరంటే?
Ipl 2023 Points Table
Follow us on

IPL 2023 Points Table: ఐపీఎల్ సీజన్ 16లో రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. ఇప్పటికే చాలా జట్లు 6 మ్యాచ్‌లు ఆడాయి. 28వ మ్యాచ్ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్‌పై విజయంతో ఆర్‌సీబీ జట్టు పాయింట్ల పట్టికలో 2 స్థానాలు ఎగబాకింది. మరోవైపు వరుస పరాజయాలతో షాక్‌కు గురైన వార్నర్ జట్టు కూడా ఎట్టకేలకు విజయాల ఖాతా తెరిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏజట్లు ఆధిపత్యం చెలయిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..

1- రాజస్థాన్ రాయల్స్ (8 పాయింట్లు): 6 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 విజయాలు, 2 ఓటములతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రాజస్థాన్ జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ +1.043గా నిలిచింది.

2- లక్నో సూపర్ జెయింట్స్ (8 పాయింట్లు): 6 మ్యాచ్‌ల్లో 2 ఓటములు, 4 విజయాలు నమోదు చేసిన కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు +0.709 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

3- చెన్నై సూపర్ కింగ్స్ (6 పాయింట్లు): మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు 5 మ్యాచ్‌ల్లో 2 ఓటములు, 3 విజయాలతో 3వ స్థానంలో ఉంది. జట్టు ప్రస్తుత పాయింట్ల పట్టిక నెట్ రన్ రేట్ +0.265.

4- గుజరాత్ టైటాన్స్ (6 పాయింట్లు): డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో 2 ఓటములు, 3 విజయాలు నమోదు చేసింది. దీంతో +0.192 నెట్ రన్ రేట్‌తో 4వ స్థానంలో ఉంది.

5- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (6 పాయింట్లు): ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని ఆర్‌సీబీ జట్టు 6 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 3 మ్యాచ్‌లు గెలిచి 3 మ్యాచ్‌లు ఓడిపోయింది. నెట్ రన్ రేట్ -0.068 సాధించి 5వ స్థానంలో నిలిచాడు.

6- ముంబై ఇండియన్స్ (6 పాయింట్లు): ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 ఓటములతో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ నెట్ రన్ రేట్ -0.164తో 6వ స్థానంలో నిలిచింది.

7- పంజాబ్ కింగ్స్ (6 పాయింట్లు): శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు ఆడిన 6 మ్యాచ్‌లలో 3 గెలిచి 3 ఓడిపోయి -0.298 నెట్ రన్ రేట్‌తో 7వ స్థానంలో నిలిచింది.

8- కోల్‌కతా నైట్ రైడర్స్ (4 పాయింట్లు): కేకేఆర్ ఆడిన 6 మ్యాచ్‌లలో 4 ఓడిపోయి 2 గెలిచింది. ప్రస్తుతం నితీష్ రాణా జట్టు +0.214 నెట్ రన్ రేట్‌తో 8వ స్థానంలో ఉంది.

9- సన్‌రైజర్స్ హైదరాబాద్ (4 పాయింట్లు): సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన 5 మ్యాచ్‌లలో 2 గెలిచి, 3 మ్యాచ్‌లు ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు -0.798 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.

10- ఢిల్లీ క్యాపిటల్స్ (2 పాయింట్లు): డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 6 మ్యాచ్‌లలో 1 గెలిచింది. దీంతో ఢిల్లీ జట్టు నెట్ రన్ రేట్ -1.183తో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..