KKR vs PBKS: రప్ఫాడించిన రసెల్‌.. ఉత్కంఠ మ్యాచ్‌లో కోల్‌కతా విజయం.. ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవం

ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా జూలు విదిల్చింది. సొంత మైదానంలో ప్రత్యర్థిపై పంజా విసిరింది. సోమవారం రాత్రి ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

KKR vs PBKS: రప్ఫాడించిన రసెల్‌.. ఉత్కంఠ మ్యాచ్‌లో కోల్‌కతా విజయం.. ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవం
Kolkata Knight Riders
Follow us
Basha Shek

|

Updated on: May 09, 2023 | 12:33 AM

ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా జూలు విదిల్చింది. సొంత మైదానంలో ప్రత్యర్థిపై పంజా విసిరింది. సోమవారం రాత్రి ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 180 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌ కతా ఆది నుంచే ధాటిగా ఆడింది. మొదట నితీశ్‌ రాణా(51), జేసన్‌ రాయ్‌(38) మెరుగ్గా ఆడగా ఆ తర్వాత రస్సెల్‌(23 బంతుల్లో 42 3 ఫోర్లు, 3 సిక్స్‌ లు ), రింకు సింగ్‌( 10 బంతుల్లో 21) చెలరేగారు. ముఖ్యంగా రసెల్ ఫోర్లు, సిక్స్‌లతో పంజాబ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కోల్‌కతా విజయానికి 12 బంతుల్లో 26 పరుగులు చేయాల్సిన సమయంలో సామ్‌ కర్రన్‌ వేసిన 19 ఓవర్‌లో 3 సిక్స్‌లతో కలిపి మొత్తం 20 పరుగులు రాబట్టాడు రస్సెల్‌. ఇక అర్ష్‌ దీప్‌ వేసిన చివరి ఓవర్‌లో ఆండ్రీ ఔటైనా సిక్సర్ల వీరుడు రింకూసింగ్‌ కోల్‌కతాను విజయ తీరాలకు చేర్చాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో రింకు సింగ్‌ ఫోర్‌ కొట్టి కేకేఆర్‌ను గెలిపించాడు. పంజాబ్‌ బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ 2, ఎలిస్‌, హర్‌ప్రీత్‌బ్రార్‌ తలో వికెట్‌ తీశారు. సునామీ ఇన్నింగ్స్‌ తో కేకేఆర్‌ను గెలిపించిన రస్సెల్‌ కే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది. తాజా విజయంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 5 వ స్థానానికి చేరుకుంది కోల్‌కతా. దీంతో పాటు ప్లే ఆఫ్‌ అవకాశాలు కూడా మెరుగయ్యాయి.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌(57) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. షారుఖ్‌ ఖాన్‌ (21), హర్‌ ప్రీత్‌ బార్‌ (17) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. . జితేశ్‌ శర్మ (21), రిషి ధావన్ (19), లివింగ్‌స్టోన్ (15), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ (12) పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు, హర్షిత్ రాణా రెండు, సుయాశ్‌ శర్మ, నితీశ్‌ రాణా ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి