Team India: ‘శాంసన్‌కు అంత సీన్ లేదు.. ఆ ప్లేయరే టీమిండియా ఫ్యూచర్ సూపర్‌స్టార్’..

సంజూ శాంసన్ కంటే ఆ ప్లేయర్‌నే బెస్ట్. అతడి బ్యాట్ నుంచి విదేశీ గడ్డపై టెస్టుల్లో సెంచరీలు నమోదయ్యాయి. అటు ఓపెనర్‌గా, ఇటు మిడిలార్డర్ బ్యాటర్‌గా నిరూపించుకున్నాడు. ఇంతకీ అతడెవరో తెలుసా..

Team India: 'శాంసన్‌కు అంత సీన్ లేదు.. ఆ ప్లేయరే టీమిండియా ఫ్యూచర్ సూపర్‌స్టార్'..
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 21, 2023 | 5:59 PM

టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు కెఎల్ రాహుల్ గత కొన్నేళ్లుగా పేలవ ఫామ్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌కు సారధ్యం వహిస్తున్న రాహుల్.. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో.. చేసింది కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు. అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు.

ఇదిలా ఉంటే.. ప్రతీ మ్యాచ్‌లోనూ విఫలమవుతున్న రాహుల్‌ను పక్కనబెట్టి.. సంజూ శాంసన్‌కు ఛాన్స్‌లు ఇవ్వాలంటూ కూడా డిమాండ్లు పెరిగాయి. ఈ తరుణంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. రాహుల్‌కి మద్దతు పలికాడు. ‘శాంసన్ కంటే రాహులే బెటర్ అని.. కెఎల్ తిరిగి ఫామ్‌లోకి రావడం లక్నో జట్టుకు శుభసూచికం’ అని అతడు పేర్కొన్నాడు.

ఇక భారత్ జట్టు విషయానికొస్తే.. ‘శాంసన్ కంటే కెఎల్ రాహుల్ చాలా బెటర్ అని నేను అనుకుంటున్నా. రాహుల్ బ్యాట్ నుంచి టెస్టుల్లో విదేశీ గడ్డపై సెంచరీలు నమోదయ్యాయి. అలాగే అటు ఓపెనర్‌గా, ఇటు మిడిలార్డర్ బ్యాటర్‌గా రాహుల్ తనకు తాను నిరూపించుకున్నాడు. టీ20ల్లో ఎన్నో పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు’ అని సెహ్వాగ్ తెలిపాడు.