IPL 2023: దేశమంతా సంజూను కోరుకుంటోంది.. ఒక్క వారు తప్ప.. నెట్టింట్లో మార్మోగుతోన్న హర్షా భోగ్లే కామెంట్

|

Apr 17, 2023 | 12:55 PM

178 పరుగుల లక్ష్య ఛేదనలో 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాజస్థాన్‌ .ఈ స్థితిలో కేవలం 32 బంతుల్లో 60 పరుగులు చేశాడు సంజూ శామ్సన్‌. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండడం విశేషం.

IPL 2023: దేశమంతా సంజూను కోరుకుంటోంది.. ఒక్క వారు తప్ప.. నెట్టింట్లో మార్మోగుతోన్న హర్షా భోగ్లే కామెంట్
Sanju Samson
Follow us on

రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూశామ్సన్‌ మళ్లీ అదరగొట్టాడు. డిపెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కిర్రాక్‌ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 178 పరుగుల లక్ష్య ఛేదనలో 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాజస్థాన్‌ .ఈ స్థితిలో కేవలం 32 బంతుల్లో 60 పరుగులు చేశాడు సంజూ శామ్సన్‌. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండడం విశేషం. ముఖ్యంగా ది మోస్ట్‌ డేంజరస్‌ స్పిన్నర్‌ రషీద్‌ వేసిన 13వ ఓవర్‌లో ఏకంగా మూడు సిక్స్‌లు బాదాడీ యంగ్‌ బ్యాటర్‌. షిమ్రోన్ హెట్‌మయర్‌తో కలిసి ఐదో వికెట్‌కు కేవలం 33 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కాగా ఎంతో ఒత్తిడిలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న సంజూశామ్సన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్‌ మీడియాలో అతను మరోసారి ట్రెండింగ్‌ అయిపోయాడు. సంజూను జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లూ మళ్లీ వచ్చేశాయి. ఈ క్రమంలో ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు హర్షా భోగ్లే చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది.

‘ నేనైతే సంజూ శాంసన్‌ను భారత్‌ టీ20 జట్టు తరఫున ప్రతి రోజూ ఆడిస్తా’ అంటూ హర్షా భోగ్లే పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. టీమిండియా సెలెక్టర్లకు సంజూ పేరు గట్టిగా వినిపించేలా భోగ్లే చాలా చక్కగా చెప్పారంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఒక్క బీసీసీఐ తప్ప భారత్‌ అంతా సంజూను కోరుకుంటోంది’ అంటూ ఒక నెటిజన్‌ ఇచ్చిన రిప్లై మాత్రం నెక్ట్స్‌ లెవెల్‌. ‘బీసీసీఐ ఇప్పటికైనా సంజూ ట్యాలెంట్‌ను గుర్తించాలి. కరెక్ట్‌గా చెప్పారు. సార్‌.. ఇప్పుడున్న ఆటగాళ్లలో చాలామంది కంటే సంజూ చాలా మెరుగైన ప్లేయర్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మొత్తానికి ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ప్రస్తుతం నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా మారిపోయాడు సంజూ. మరి బీసీసీఐ, భారత సెలెక్టర్లు ఈసారైనా సంజూపై దయ చూపిస్తారో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..