
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయంతో గుజరాత్ టైటాన్స్ తమ ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే, తొలి విజయం తర్వాత హార్దిక్ పాండ్యాకు మరింత టెన్షన్ పెరిగింది. గుజరాత్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ మొత్తం టోర్నీకి దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి. విలియమ్సన్ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో భాగంగా బరిలోకి దిగాడు. అయితే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతని మోకాలికి గాయమైంది. దీంతో అతను మైదానం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
తొలి విజయం తర్వాత గుజరాత్‌కు భారీ దెబ్బ తగిలింది. 13వ ఓవర్‌లో చెన్నై ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ భారీ షాట్ కొట్టడంతో విలియమ్సన్ గాయపడ్డాడు. విలియమ్సన్ ఆ బంతిని బౌండరీ దగ్గర పట్టుకునేందుకు ప్రయత్నించాడు. గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టలేకపోయాడు. ఈ క్రమంలోనే ఆయన గాయపడ్డాడు.
విలియమ్సన్ బౌండరీ వద్దే నొప్పితో మూలుగుతూ ఉన్నాడు. సరిగ్గా నిలబడలేకపోయాడు. దీంతో విలియమ్సన్‌ను సిబ్బంది వచ్చి మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. విలియమ్సన్ స్థానంలో సాయి సుదర్శన్ మైదానంలోకి వచ్చాడు. అతను బ్యాట్‌తో 22 పరుగులు చేశాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గుజరాత్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ విలియమ్సన్ గాయం ఇబ్బందిగానే ఉందని చెప్పుకొచ్చాడు.
విలియమ్సన్ గాయం న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్‌లో టెన్షన్‌ను పెంచింది. విలియమ్సన్ కోలుకోవడానికి సమయం పడుతుందని స్టెడ్ భావిస్తున్నాడు. వన్డే ప్రపంచ కప్ కూడా ఆడాల్సి ఉంది. ఈ కారణంగా విలియమ్సన్ గాయం గురించి స్టెడ్ కూడా ఆందోళన చెందుతున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..