AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ‘నువ్వు.! నా కాళ్లకంటిన మట్టితో సమానం..’ ముందుగా గొడవ మొదలైంది ఇక్కడే.. వీడియో వైరల్!

నిన్న మ్యాచ్ పూర్తయిన అనంతరం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌ మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఇద్దరి మధ్య మాటలు తూటాలు పేలడమే కాదు.. వారి ప్రవర్తనతో సహచర ఆటగాళ్లు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Virat Kohli: 'నువ్వు.! నా కాళ్లకంటిన మట్టితో సమానం..' ముందుగా గొడవ మొదలైంది ఇక్కడే.. వీడియో వైరల్!
Virat Kohli
Ravi Kiran
|

Updated on: May 02, 2023 | 1:39 PM

Share

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్). ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఎలాంటి వివాదం లేకపోగా.. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌తో మరోసారి ఆటగాళ్ల మధ్య గొడవలు బయటపడ్డాయి. నిన్న మ్యాచ్ పూర్తయిన అనంతరం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌ మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఇద్దరి మధ్య మాటలు తూటాలు పేలడమే కాదు.. వారి ప్రవర్తనతో సహచర ఆటగాళ్లు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం నెట్టింట వీరిద్దరి మధ్య జరిగిన గొడవ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ తరుణంలో తాజాగా విరాట్ కోహ్లీ తన బూట్లకు ఉన్న మట్టిని చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ తన బూట్లకున్న మట్టిని చూపిస్తూ ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నాడు. వీడియో ఫ్రేమ్‌లో లక్నో ఆటగాడు అమిత్ మిశ్రా, అంపైర్ మాత్రమే కనిపించారు. విరాట్ ఎవ్వరిని ఉద్దేశించి ఆ విధంగా చేశాడా.? అన్నది మాత్రం క్లారిటీ లేదు. అయితే చాలామంది నెటిజన్లు మాత్రం విరాట్ కోహ్లీ ‘నువ్వు.! నా కాళ్ల దుమ్ముతో సమానం..’ అంటూ నవీన్-ఉల్-హక్‌ను ఉద్దేశించి చెప్పాడని ట్విట్టర్ వేదికగా కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు.

అసలు మ్యాటరేంటంటే..

లక్నో ఇన్నింగ్స్ 16వ ఓవర్ పూర్తయిన సమయంలో ఏదో విషయంలో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య వివాదం రాజుకుంది. దాన్ని అంపైర్, మిశ్రా ఆపాలని చూశారు. అయితే అప్పటికే విరాట్ కోహ్లీ పూర్తి అగ్రెషన్‌లో ఉన్నాడు. ఇక ఈ వాగ్వాదం కాస్తా.. మ్యాచ్ అనంతరం గంభీర్, కోహ్లీ మధ్య గొడవకు కారణమైంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో సహచర ఆటగాళ్లు వారిద్దరిని విడదీశారు. ఇదిలా ఉంటే.. గతంలో ఈ రెండు టీమ్స్‌కి మధ్య బెంగళూరులో మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో లక్నో గెలవగా.. గౌతమ్ గంభీర్ ఆర్సీబీ ఫ్యాన్స్‌కు నోరు మూసుకోవాల్సిందిగా సైగ చేశాడు. దానికి రివెంజ్‌గా ఈ మ్యాచ్‌లో కోహ్లీ మ్యాచ్ గెలిచాక అగ్రెసివ్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా, ఈ గొడవకు కారణంగా అటు విరాట్ కోహ్లీ, ఇటు గౌతమ్ గంభీర్, ఆఫ్ఘన్ ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్ మ్యాచ్ ఫీజులపై కోట పడింది. కోహ్లీ, గంభీర్ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించగా, నవీన్ ఉల్ హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. ఈ సీజన్‌తోనే నవీన్-ఉల్-హక్ మొదటిసారిగా ఐపీఎల్ ఆడుతున్న విషయం విదితమే.